Punjab: ఆప్ ముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం.. భగవంత్ మాన్ ఇంటి సమీపంలో బాంబు కలకలం..
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ ఇంటి సమీపంలో బాంబు లభ్యం కావడంతో ఆ రాష్ట్రంలో కలకలం రేగింది. సోమవారం సీఎం భగవంత్ హెలిప్యాడ్‌కు 500 మీటర్ల దూరంలో..
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ ఇంటి సమీపంలో బాంబు లభ్యం కావడంతో ఆ రాష్ట్రంలో కలకలం రేగింది. సోమవారం(జనవరి 2) సీఎం భగవంత్ హెలిప్యాడ్‌కు 500 మీటర్ల దూరంలో అంటే చండీగఢ్‌లోని కన్సాల్, మొహాలీలోని నయా గావ్ సరిహద్దుల్లో బాంబును గుర్తించారు. మామిడి తోటలో ట్యూబ్‌వెల్ ఆపరేటర్ ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో దీనిని మొదటిగా చూసి అధికారులకు సమాచారమివ్వడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బాంబును నిర్వీర్యం చేసింది.
అయితే ఈ బాంబు పేలినట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేదని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. బాంబ్ లభ్యమైన ప్రదేశంలో కాలినడకన వెళ్లే స్థానిక ప్రజలు తప్ప ట్రావెలింగ్ జోన్ కాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
200 మీటర్ల దూరంలోనే సీఆర్పీఎఫ్ క్యాంపు:
బాంబు లభ్యమైన సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన నివాసంలో లేరు. అయినప్పటికీ ఈ ఘటన నేపథ్యంలో ఆయన నివాసానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాక హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం కూడా సమీపంలోనే ఉంది. విశేషమేమిటంటే బాంబు దొరికిన ప్రదేశానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే సీఆర్పీఎఫ్ క్యాంపు కూడా ఉండడం. కాగా బాంబు వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలంతా ఘటనాస్థలంలో గుమిగూడారు. దీంతో భద్రతాదళాలు రంగంలోని దిగి మొత్తం ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.