- Telugu News Photo Gallery Amazing and Effective to get rid of Seasonal Flu, Cough in this winter season
Health Tips: చలికాలంలో సీజనల్ ఫ్లూతో బాధపడుతున్నారా..? అయితే మీ ఇంట్లో ఉండే ఈ పదార్థాలే మీకు మేలు చేస్తాయి అని గుర్తించండి..
చలికాలంలో ఫ్లూ, దగ్గు, జలుబు వంటి సీజనల్ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలను నివారించేందుకు మెడిసిన్స్ మీద ఆధారపడడం కంటే ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.
Updated on: Jan 20, 2023 | 2:14 PM


అల్లం: అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండడం వల్ల ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాక జలుబు, దగ్గును నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందు కోసం కొన్ని అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగాలి లేదా అల్లం టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.

మిరియాలు: యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న మిరియాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంతో ఎంతగానో సహాయపడతాయి. ఇందుకోసం ఒక కప్పు నీటిలో ఎండుమిర్చి వేసి ఆ నీటిని మరిగించాలి. తర్వాత దానికి కొంచెం తేనె కలిపి తాగితే సరిపోతుంది.

తేనె: జలుబు, ఫ్లూ ఉన్నట్లయితే ఉపశమనం కోసం తేనె, అల్లం రసాన్ని కలిపి తీసుకోవచ్చు. ఇలా చేస్తే సమస్య నుంచి వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది.

తులసి - తులసిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున దీని ఆకులు జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం అందించడంలో ఉపయోగపడతాయి. తులసిలో ఉన్న అనేక రకాల ఔషధ గుణాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. తులసి ఆకులను నేరుగా తినవచ్చు. లేదా తులసి టీ రూపంలో కూడా తాగవచ్చు.




