Watch Video: ఆడుకుంటున్న చిన్నారిపై ఇంత కోపమా..? మూడేళ్ల బాలికను రైల్వే ట్రాక్ పైకి తోసేసిన మహిళ.. చివరకు ఏమయ్యిందంటే..?

కొందరు చేసే మూర్ఖపు పనులు పక్కవారికి కోపం తెప్పించడమేమో కానీ కొన్ని సందర్భాలలో పెను ప్రమాదాల పాలు చేస్తుంటాయి. అచ్చం ఇలాంటి మూర్ఖపు పనినే చేసింది ఆమెరికాకు చెందిన..

Watch Video: ఆడుకుంటున్న చిన్నారిపై ఇంత కోపమా..? మూడేళ్ల బాలికను రైల్వే ట్రాక్ పైకి తోసేసిన మహిళ.. చివరకు ఏమయ్యిందంటే..?
Brianna Pushing 3 Years Old Onto Train Track
Follow us

|

Updated on: Jan 02, 2023 | 5:58 PM

కొందరు చేసే మూర్ఖపు పనులు పక్కవారికి కోపం తెప్పించడమేమో కానీ కొన్ని సందర్భాలలో పెను ప్రమాదాల పాలు చేస్తుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో కూడా  చూస్తూనే ఉంటాం. అచ్చం ఇలాంటి మూర్ఖపు పనినే చేసింది ఆమెరికాకు చెందిన ఒక మహిళ. ఆమె చేసిన దారుణం ఏమిటో తెలిస్తే మీకు కూడా పట్టరాని కోపం రాకుండా ఉండదు మరి.  రైల్వే ప్లాట్‌ఫామ్ మీద ఉన్న మూడేళ్ల చిన్నారిని ట్రైన్ ట్రాక్‌పైకి తోసేసింది సదరు మహిళ. వెంటనే అప్రమత్తమైన అక్కడివారు ఆ చిన్నారిని ట్రాక్ మీద నుంచి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. గడిచిన డిసెంబర్ 28న అమెరికాలోని ఓరెగాన్‌లో జరిగింది.

అయితే ఈ ఘటన గురించి వెంటనే విషయం తెలుసుకున్న ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సిబ్బంది నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనకు సంబంధించిన వీడియోను సీసీటీవీ ఫుటేజీ నుంచి సేకరించిన ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తన అధికారిక వైబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రైల్వే ప్లాట్‌ఫామ్ మీద నిలబడి ఉన్న చిన్నారిని చూడవచ్చు. ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారిని వెనుక నుంచి ఒక వ్యక్తి లేచి ట్రాక్ మీదకు నెట్టి తిరిగి తన కుర్చీలో కూర్చోవడాన్ని కూడా గమనించవచ్చు. అక్కడే ఉన్నవారు వెంటనే ఆప్రమత్తమవ్వడాన్నిసైతం వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

చిన్నారిని ట్రాక్ మీదకు నెట్టేస్తున్న వీడియో..

కాగా ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ఆ మూడేళ్ల చిన్నారిపై దాడి చేసినది బ్రియాన్నా లేస్ వర్క్‌మాన్(32)గా గుర్తించారు. అసలు ఆమె ఎందుకు ఆ చిన్నారిపై దాడి చేసిందనే విషయాలు తెలియరాలేదు. ముల్త్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ..ఘటనకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి దాడికి ప్రయత్నించడం, ప్రజా రవాణాలో జోక్యం చేసుకోవడం, క్రమశిక్షణారహితంగా ప్రవర్తించడం వంటి అభియోగాలతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రయాణీకులలో ఒకరైన బ్లెయిన్ డాన్లీ.. స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘అందుకు ఎటువంటి కారణం లేదు. ఎవరైనా అలాంటి పని ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు’ అని చెప్పారు. అదే క్రమంలో నెటిజన్లు కూడా విస్తుపోతున్నారు. అంతేకాక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.