Eye Drop Tips: మీరు ఐ డ్రాప్స్ వాడుతున్నారా..? అయితే ఈ తప్పులను అసలు చేయకండి.. చేస్తే పెను ప్రమాదమే..

కొందరు కళ్లు మంటలు అనిపించినప్పుడు లేదా కంట్లో ఏవైనా దూళీ కణాలు పడినప్పుడు వాటిని తొలగించేందుకు ఐ డ్రాప్స్ వాడుతుంటారు. ఎప్పుడో ఒక సారి ఈ డ్రాప్స్‌ను వాడితే ఏం..

Eye Drop Tips: మీరు ఐ డ్రాప్స్ వాడుతున్నారా..? అయితే ఈ తప్పులను అసలు చేయకండి.. చేస్తే పెను ప్రమాదమే..
Mistakes To Avoid While Taking Eye Drops Regularly
Follow us

|

Updated on: Jan 02, 2023 | 10:05 PM

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటే శరీరంలోని అన్ని ఇంద్రియాలలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని అర్థం. కాబట్టి కంటి సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కళ్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల మనకు కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కంటి సమస్యలు అంటే కళ్లలో నొప్పి, తలనొప్పి, చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం వంటివి.

అయితే కొందరు కళ్లు మంటలు అనిపించినప్పుడు లేదా కంట్లో ఏవైనా దూళీ కణాలు పడినప్పుడు వాటిని తొలగించేందుకు ఐ డ్రాప్స్ వాడుతుంటారు. ఎప్పుడో ఒక సారి ఈ డ్రాప్స్‌ను వాడితే ఏం కాదు. కానీ నిత్యం కళ్లలో కంటి చుక్కలను వేస్తున్నట్లయితే అందుకు ప్రతిగా అనేక కొత్త సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కంటి చుక్కలను వేసుకున్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలను పాటించితీరాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కళ్లను ఎక్కువగా రుద్దడం: కంటి చుక్కలను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఏదైనా అవసరం కొద్దీ కంటి చుక్కలను వాడితే ఆ సమయంలో కళ్లను రుద్దకూడదు. అలా రుద్దడం వల్ల కూడా కంటి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తరచుగా రెప్పవేయడం: కంటి నొప్పి, ఒత్తిడిని నివారించడానికి రెప్పవేయడం చాలా ముఖ్యం.  కళ్ళను రక్షించుకోవడానికి ఇది ఒక సహజసిద్దమైన రక్షణ మార్గం. అయితే కంటిలో ఐ డ్రాప్స్ వేసుకున్నప్పుడు తరచూడ రెప్పవేయకూడదు. అలా చేయడం వల్ల కంటిపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.

 కంటి ప్యాచ్‌తో నిద్రపోవడం: చాలా మంది వ్యక్తులు తమ కంటిపై చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఐ ప్యాచ్‌ను ఉపయోగించటానికి ఇష్టపడతారు. హాట్ కంప్రెస్ ఐ ప్యాచ్ ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే నిద్రపోతున్నప్పుడు కంటి ప్యాచ్ ఉపయోగించడం ఎప్పుడూ సరైనది కాదు. ఏ రకమైన ఐ మాస్క్ అయినా రాత్రిపూట కళ్లపై వేసుకోకూడదు. ఇది కంటిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..