Telangana: ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు’లో సిట్‌కు మరోసారి చుక్కెదురు.. మెమోను కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు.. పూర్తి వివరాలిలే..

తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నిందితులుగా ఉన్నవారు కాకుండా మరో ముగ్గురిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోకు..

Telangana: ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు’లో సిట్‌కు మరోసారి చుక్కెదురు.. మెమోను కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు.. పూర్తి వివరాలిలే..
Ts High Court Quashes Sit Memo
Follow us

|

Updated on: Jan 02, 2023 | 3:33 PM

తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నిందితులుగా ఉన్నవారు కాకుండా మరో ముగ్గురిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోకు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురయింది. కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌ను కూడా నిందితులుగా చేర్చాలంటూ గత నెలలో తెలంగాణ హైకోర్టును సిట్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.అయితే హైకోర్టు సిట్ మెమోను కొట్టివేసింది. అంతేకాక ఈ మెమోను ముందుగానే కొట్టివేసిన ఏసీబీ కోర్టు తీర్పును కూడా హైకోర్టు సమర్థించింది.

గడిచిన డిసెంబర్ ప్రారంభంలో సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్‌కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు. ఆ క్రమంలోనే బీఎల్ సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని కోర్టు తెలిపింది.ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు(జనవరి 2) విచారణ జరిపిన హైకోర్టు సిట్ మెమోను కొట్టివేసింది.

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెరమీదకు వచ్చింది. ఈ ఉదాంతం వెనుక బీజేపీ హస్తం ఉందని మొదటి నుంచి ఆరోపిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ వాదనలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. సిట్ తదుపరి అడుగులు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

https://tv9telugu.com/tag/telangana