Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. బీఎస్‌పీ ఆరోపణలతో మరోసారి దుమారం..
ఇటీవలే తన ఫోన్ సైతం ట్యాప్ అవుతుందేమోనన్న అనుమానాన్ని గవర్నర్ కూడా వ్యక్తం చేయడం, ఇప్పుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం అదే ఆరోపణలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన ఫోన్‌ను ట్యాప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ఆపిల్ ఫోన్ వాడతానని, ఆ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్‌పై తనకు మెయిల్ వచ్చిందని, జాగ్రత్తగా ఉండాలని తనను అలర్ట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రవీణ్‌కుమార్ ఆరోపణలతో తెలంగాణ రాజకీయం ట్యాపింగ్‌పై నడుస్తోంది. సొంత పార్టీ నేతలపైనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.
మరోవైపు ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది అధికార పార్టీ. ట్యాపింగ్ అంశం కేంద్రం పరిధిలోదంటూ ఆ పార్టీ నేత క్రిశాంక్ పేర్కొన్నారు.
రాజకీయ ఆరోపణల సంగతెలా ఉన్నా ఐఫోన్లను కూడా ట్యాప్ చేయొచ్చని టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ నల్లమోతు శ్రీధర్ తెలిపారు. కాగా, ఇటీవలే తన ఫోన్ సైతం ట్యాప్ అవుతుందేమోనన్న అనుమానాన్ని గవర్నర్ కూడా వ్యక్తం చేయడం, ఇప్పుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం అదే ఆరోపణలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..