Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: హైడ్రామా నడుమ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌.. రెండున్నర గంటల తర్వాత విడుదల.. పోరాటం ఆగదంటూ..

సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునివ్వడంతో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీభవన్‌ అండ్ రేవంత్‌ ఇంటి దగ్గర గంటల తరబడి హైటెన్షన్‌ కొనసాగింది. అయితే, అరెస్టులతో...

Revanth Reddy: హైడ్రామా నడుమ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌.. రెండున్నర గంటల తర్వాత విడుదల.. పోరాటం ఆగదంటూ..
Revanth Reddy
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2023 | 9:51 PM

సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునివ్వడంతో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీభవన్‌ అండ్ రేవంత్‌ ఇంటి దగ్గర గంటల తరబడి హైటెన్షన్‌ కొనసాగింది. అయితే, అరెస్టులతో తమను ఆపలేరని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసేవరకూ కాంగ్రెస్‌ పోరాడుతుందంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ఆందోళనలతో గాంధీభవన్‌ పరిసరాలు దద్దరిల్లిపోయాయ్‌. సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్‌ ధర్నాలు, రాస్తారోకోలకు పిలునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్‌ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, గాంధీభవన్‌ నుంచి ధర్నా చౌక్‌కి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో పరిసరాలు అట్టుడికిపోయాయి.

ఇక అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌ ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మొదట, రేవంత్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఆ తర్వాత బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. గాంధీభవన్‌, రేవంత్‌ ఇంటి దగ్గరి నుంచి ఉద్రికత్త పరిస్థితి బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కి షిఫ్ట్‌ అయ్యింది. రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కి తరలించడంతో కార్యకర్తలు పీఎస్‌ను ముట్టడించారు. సుమారు రెండున్నర గంటల హైడ్రామా తర్వాత పోలీసులు రేవంత్‌ను విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..