FD Rates 2023: ఈ ఏడాది తొలి త్రైమాసికానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలివే..
జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లతో సహా చిన్న చిన్న డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. ప్రతి మూడు నెలలకోసారి వివిధ రకాల పొదుపు..
జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లతో సహా చిన్న చిన్న డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. ప్రతి మూడు నెలలకోసారి వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను నిర్ణయించే ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆదే క్రమంలో తాజా నిర్ణయం తీసుకుంది. రిస్క్ లేని డిపాజిట్లను కోరుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు ఇంకా పోస్ట్-ఆఫీస్ టర్మ్ డిపాజిట్లు కూడా వివిధ నిబంధనల ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. మరి పోస్ట్ ఆఫీసు టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో SBI , ICICI బ్యాంక్, HDFC బ్యాంక్‌ల రేట్లతో పోల్చి చూద్దాం..
- పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు (POTD): వడ్డీరేట్లపై తాజా పెంపు తర్వాత పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లు వరుసగా ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, 3 సంవత్సరాల కాలవ్యవధికి 6.6%, 6.8% , 6.9% వడ్డీ రేటును అందిస్తున్నాయి. అలాగే 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్‌పై కస్టమర్‌లు 7% వడ్డీని పొందుతారు.
- HDFC బ్యాంక్ FD వడ్డీ రేట్లు: డిసెంబర్ 14, 2022 నాటికి, HDFC బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల మధ్య కాలానికి 6.50% నుంచి 7% శాతం మధ్య వడ్డీ రేటును ప్రకటించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ అయితే వడ్డీ రేటు 3.50% నుంచి 6% మధ్య ఉంటుంది.
- SBI FD వడ్డీ రేట్లు: డిసెంబర్ 13, 2022 నాటికి SBI ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల మధ్య కాలవ్యవధికి 6.25% నుంచి 6.75% శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ అయితే వడ్డీ రేటు 3% నుంచి 5.75% మధ్య ఉంటుంది.
- ICICI FD వడ్డీ రేట్లు: ICICI బ్యాంక్ కూడా ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల మధ్య కాలానికి 6.60% నుంచి 7% శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ డిపాజిట్లకు వడ్డీ రేటు 3% నుంచి 5.75% మధ్య ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2022 నుంచి కీలక రేట్లను పెంచడం ప్రారంభించింది. దీంతో బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
మరిన్ని బెజినెస్ వార్తల కోసం..