Viral: అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. అందమైన అమ్మాయితో మసాజ్.. వీడియో చూస్తే మీరే స్టన్ అవుతారు..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ మొసలికి యువతి మసాజ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. అందమైన అమ్మాయితో మసాజ్.. వీడియో చూస్తే మీరే స్టన్ అవుతారు..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 01, 2023 | 8:05 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ మొసలికి యువతి మసాజ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా.. మొసలి అంటే భయంతో వణికిపోతుంటారు. ఎందుకంటే దానితో ఆటలు ప్రాణాలకే ప్రమాదం.. మొసలికి సంబంధించిన వీడియోల్లో.. చాలామంది గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా నీటిలో అయితే.. మొసలి పెద్ద పెద్ద జంతువులకే సవాల్ చేస్తుంటుంది. మొసలి నొట చిక్కితే.. బతికి బట్టకట్టడం అసాధ్యం. అయితే. దీనికి భిన్నంగా ఒక అమ్మాయి మొసలికి బాడీ మసాజ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వైరల్ వీడియోలో.. ఓ యువతి.. ఎలాంటి భయం లేకుండా చాలా సౌకర్యవంతంగా మొసలికి మసాజ్ చేస్తుంటుంది. ఇందులో ఓ అమ్మాయి ఎలాంటి భయం, సంకోచం లేకుండా చాలా హాయిగా మొసలికి మసాజ్ చేస్తుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో మొసలి హాయిగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. యువతి మొసలి పాదాలను.. భుజాలను పట్టుకుని మసాజ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. మొసలిని చూస్తుంటే అది కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వీడియోను Figen అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనేది ధృవీకరించబడనప్పటికీ.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మొసలి చాలా ప్రమాదకరమైన జంతువు అని.. దానితో అలా ఆడటం మంచిది కాదని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..