Diabetes: వామ్మో.. డయాబెటిస్ ఆ మూడు అవయవాలనే టార్గెట్ చేస్తుందట.. ముందే జాగ్రత్త పడండి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ పేషెంట్లలో 17 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. షుగర్ అనేది ఒక వ్యాధి కానప్పటికీ.. ఇతర వ్యాధులను ప్రేరేపించే కారకమని.. ఇది క్రమంగా ప్రాణాంతకం అని వైద్య నిపుణులు మెచ్చరిస్తున్నారు.

Diabetes: వామ్మో.. డయాబెటిస్ ఆ మూడు అవయవాలనే టార్గెట్ చేస్తుందట.. ముందే జాగ్రత్త పడండి..
Side Effects Of Diabetes
Follow us

|

Updated on: Dec 31, 2022 | 9:57 PM

Side Effects Of Diabetes: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం పట్టిపీడిస్తోంది. లక్షలాది మంది బాధితులుగా మారారు. దేశంలో కూడా షుగర్ వ్యాధి కేసుల సంఖ్య నానాటికీ పెరుతోంది. అధికంగా డయాబెటిస్ కేసులు అధికంగా నమోదయ్యే దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ పేషెంట్లలో 17 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. షుగర్ అనేది ఒక వ్యాధి కానప్పటికీ.. ఇతర వ్యాధులను ప్రేరేపించే కారకమని.. ఇది క్రమంగా ప్రాణాంతకం అని వైద్య నిపుణులు మెచ్చరిస్తున్నారు. షుగర్ పేషెంట్ల శరీరం క్రమంగా బలహీనంగా మారుతుంది. తరువాత కొన్ని తీవ్రమైన వ్యాధులు చుట్టుముడతాయి. రక్తపోటు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు వంటి ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా, మూత్రపిండాలు రక్త శుద్ధి చేసే పనిని సరిగ్గా చేయలేవు. ఇలా డయాబెటిస్ క్రమంగా ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. మధుమేహం ప్రధానంగా మూడు అవయవాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మూడు అవయవాలపై డయాబెటిస్ ప్రభావం..

గుండె, మూత్రపిండాలు, కళ్ళు పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ప్రారంభంలో మధుమేహం ఈ అవయవాల పనికి ఆటంకం కలిగించి, వాటిని తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇతర వ్యాధులు సైతం విజృంభిస్తాయి. అందుకే షుగర్ సమస్యను మొదటి నుంచి అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మీ మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

ఈ టీ తో  ప్రయోజనం..

ఒక చెంచా మెంతి గింజలు, 4 నుంచి 5 తులసి ఆకులు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు పసుపు పొడిని ఒక కప్పు నీటిలో వేసి.. మంచి మరిగించి టీ తయారు చేసుకోండి. ఇలా తయారైన టీని రోజుకు రెండు సార్లు తాగవచ్చు. ఇది పెరిగిన చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

జీవనశైలిలో మార్పులు, ప్రతిరోజూ వ్యాయామం, నిద్ర పోయే సమయం, మేల్కొనే సమయాన్ని సరైన విధంగా అనుసరించడం ద్వారా మీరు షుగర్ స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.

షుగర్ ను నియంత్రించే మార్గం

  • మధుమేహ వ్యాధిగ్రస్తులు పగటిపూట నిద్రపోకూడదు.
  • పెరుగు తినడం మానుకోండి. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తినకూడదు.
  • గొధుమ, మైదా పిండితో చేసిన ఆహారాలను అస్సలు తినవద్దు. ఇవి జీర్ణక్రియను మందగించేలా చేసి చక్కెర స్థాయిని పెంచుతాయి.
  • గ్లూటెన్ రహిత ఆహారం తీసుకోండి. వేయించిన వస్తువులకు దూరంగా ఉండండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..