New Year 2023: మందుబాబులా మజాకా..! న్యూ ఇయర్ వేళ కిక్కే కిక్కు.. అందరూ ఈ బ్రాండ్‌లనే తాగేస్తున్నారట..

న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ సారి న్యూ ఇయర్ వీకెండ్ లో రావడంతో.. 2023 ను ఘనంగా స్వాగతం పలికేందుకు యువత భారీగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి.

New Year 2023: మందుబాబులా మజాకా..! న్యూ ఇయర్ వేళ కిక్కే కిక్కు.. అందరూ ఈ బ్రాండ్‌లనే తాగేస్తున్నారట..
Liquor
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 31, 2022 | 7:25 PM

న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ సారి న్యూ ఇయర్ వీకెండ్ లో రావడంతో.. 2023 ను ఘనంగా స్వాగతం పలికేందుకు యువత భారీగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే కొంతమంది శుక్రవారం నుంచే న్యూ ఇయర్ పార్టీని ప్రారంభించారు. వీటన్నింటి నడుమ హౌస్ పార్టీ అయినా.. రెస్టారెంట్, బార్ ఇలా ఎక్కడికి వెళ్లినా పార్టీలో జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

డిసెంబరు నుంచి కొత్త సంవత్సర వారాంతం కోసం కంపెనీలు సిద్ధం అయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, మద్యం అమ్మకాలు నెల పొడవునా క్రమంగా పెరిగింది. అయితే క్రిస్మస్ వారాంతంలో చూసినట్లుగానే చివర్లో తీవ్ర పెరుగుదల కనిపించిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

బార్లలో 80 శాతం మద్యం బుక్..

ముఖ్యంగా, ఢిల్లీ NCRలో కాక్‌టెయిల్ & డ్రీమ్స్, కేఫ్ లుంగ్టా, సైడ్‌కార్, స్పీకీసీ వంటి బార్‌లను నడుపుతున్న థర్స్టీ త్రీ హాస్పిటాలిటీ తమ మద్యం స్టాక్‌లో 80 శాతం ఇప్పటికే బుక్ అయినట్లు తెలిపింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ‘ సోల్డ్-అవుట్’ బోర్డుని పెట్టినట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ నెల మొత్తం వేడుకగా గడిచిపోయిందని కంపెనీ సహ వ్యవస్థాపకురాలు మీనాక్షి సింగ్‌ను ఉటంకిస్తూ మింట్ పేర్కొంది. పాశ్చాత్య దేశాల్లో నెలంతా పండుగలు జరుపుకునే ట్రెండ్ ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 నుంచి 35 శాతం ఎక్కువ మంది కస్టమర్లు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో కంపెనీ రూ.3,000 ప్యాకేజీల నుంచి విక్రయాలను ప్రారంభించిందని పేర్కొన్నారు.

బాగా అమ్ముడవుతున్న టేకిలా-షాంపైన్ ..

మోనికా ఆల్కోబెవ్ .. దేశంలోని ఒక ప్రధాన ఆల్కహాల్ దిగుమతిదారు.. పంపిణీదారు. ఈ సంవత్సరం టేకిలా, షాంపైన్ అమ్మకాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు టెంపుల్టన్ రాయ్ విస్కీ, క్రియంటే మెజ్కల్ టెక్విలా, షోయా ఉమేషు, లా బోటిజా పిస్కో వంటి మద్యం ఉత్పత్తులను కాక్‌టెయిల్స్‌లో కలిపి విక్రయాలు సాగనున్నాయి.

ఈసారి మద్యం విక్రయాల ట్రెండ్‌లో చాలా తేడా కనిపిస్తోందని కంపెనీ నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ హేమంగ్ చందత్ చెబుతున్నారు. కాంప్లెక్స్‌ కాక్‌టెయిల్‌లో కలిపేందుకు జనం మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో, ఇంట్లో, రెస్టారెంట్లలో నాణ్యమైన మద్యం విక్రయాలు కూడా ఇదే పద్ధతిలో జరుగుతున్నాయన్నారు.

ఇటు తెలంగాణ, ఏపీలో కూడా యూత్ ఎక్కువగా బీర్లు తాగేందుకు ఎక్కుంగా ఆసక్తి చూపుతుందని.. ఆ తర్వాత విస్కీ, బ్రాందీ లాంటి వాటిని తాగేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా