- Telugu News Photo Gallery PF withdrawal process Know step by step EPF Withdrawal Procedure and Documents needed
EPFO Withdrawal: ఉద్యోగులకు అలెర్ట్.. పీఎఫ్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా..? అయితే, ఈ పత్రాలు తప్పనిసరి..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల సౌలభ్యం కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవడంతోపాటు EPFO e-SEWA పోర్టల్ ద్వారా సింపుల్ విత్ డ్రా చేసుకోవచ్చు.
Updated on: Jan 02, 2023 | 12:37 PM


ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు PAN లింక్ చేయకపోతే, ఉపసంహరణ సమయంలో 30 శాతానికి బదులుగా 20 శాతం TDS విధిస్తారు. ఈ నియమం 1 ఏప్రిల్ 2023 నుంచి వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ నియమం పాన్ కార్డు జతచేయని ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం లభిస్తుంది.

5 సంవత్సరాలలోపు ఉపసంహరణకు పన్ను విధింపు: పీఎఫ్ ఉపసంహరణ 5 సంవత్సరాలలోపు చేస్తే, అప్పుడు పన్ను విధిస్తారు. ఐదేళ్ల తర్వాత ఉపసంహరణలపై పన్ను మినహాయింపు ఉంటుంది.

UAN నెంబర్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్, చందదారుని వివరాలు ఉండాలి. చిరునామా, ఫోటో, EPFO ప్రొఫైల్ కలిగి ఉండాలి.

'వివరాలను అందించండి' ట్యాబ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, 'సేవ్ చేయి'పై క్లిక్ చేయండి. 'కుటుంబ వివరాలను జోడించు' ఎంపికపై క్లిక్ చేసి, నామినీ(ల)ని వివరాలను జోడించండి. 'నామినీ వివరాలు' ఎంపికపై క్లిక్ చేసి, నామినీ(ల) వాటాను పొందుపరచండి

నామినీ కోసం: ఆధార్ కార్డు, స్కాన్ చేసిన ఫోటో, బ్యాంకు ఖాతా సంఖ్య, IFSC కోడ్, చిరునామా రుజువు లాంటివి తప్పనిసరి.

ఉద్యోగుల ఖాతాకు పాన్ కార్డును లింక్ చేసి ఉంటే 10% TDS విధిస్తారు. పాన్ కార్డ్ లింక్ చేయకుంటే 30% ఉన్న TDS ను 10శాతం తగ్గించి.. 20శాతంగా చేశారు.





























