- Telugu News Photo Gallery Experts suggest that those suffering from belly fat should follow some tips Telugu news
Belly Fat: బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బందులా.. ఈ టిప్స్ పాటించి చూడండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది..
పొట్టలో కొవ్వును తగ్గించుకుని స్లిమ్‌గా కనిపించాలని చాలామంది అనుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే పొట్టలోని అదనపు కొవ్వు తగ్గించడంలో పుదీనా సమర్థంగా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజూ 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. ....
Updated on: Jan 02, 2023 | 12:16 PM

శరీరంలోని కొవ్వులో ఎక్కువ భాగం పొత్తికడుపు ప్రాంతంలో నిల్వ ఉంటుంది. విసెరల్ ఫ్యాట్ అని పిలువబడే ఈ రకమైన కొవ్వు మధుమేహం, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కలిగిస్తుంది. దీనికి తోడు చలికాలంలో చాలామంది బద్ధకంగా ఉంటారు. వ్యాయామానికి దూరంగా ఉంటారు.

కొన్ని ఆహారాలు కూడా బరువు పెరగడానికి దారితీస్తాయి. ఈ క్రమంలో చలికాలంలో పొట్ట కొవ్వును తగ్గించుకోవడం కష్టం. అయితే ఇందుకోసం ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇది జీవక్రియను పెంచుతుంది. మీకు అవసరమైనప్పుడు రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.

ఇక ప్రతిరోజూ 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది సులభమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


ఆయుర్వేద నిపుణుల ప్రకారం మెంతులు వేయించి పొడి చేసి పచ్చిగా లేదా నీళ్లలో కలిపి తీసుకోవచ్చు. ఈ పానీయం ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. లేదా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.





























