AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: కిసాన్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారా..? ఇక అవసరం లేదు.. ఇలా చేస్తే సరి..

ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదు రైతులకు అందింది. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో..

PM Kisan Yojana: కిసాన్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారా..? ఇక అవసరం లేదు.. ఇలా చేస్తే సరి..
Pm Yojana Kisan
Shaik Madar Saheb
|

Updated on: Jan 03, 2023 | 12:27 PM

Share

PM Kisan Registration: వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రైతుల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించి రైతులకు చేయూత అందిస్తోంది. ఏడాదికి రూ.6,000 చొప్పున.. మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది. అయితే, ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదు రైతులకు అందింది. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం.. రైతుల రిజిస్ట్రేషన్ (పీఎం కిసాన్ స్కీమ్ రిజిస్ట్రేషన్) ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీనికోసం పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు రైతులు ఇంటి వద్ద కూర్చొని సెల్ఫ్ రిజిస్ర్టేషన్ చేసుకుని.. రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6వేలను సద్వినియోగం చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి..

రైతులు కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా సాంకేతికతతో కూడా అనుసంధానం కావాలన్న ప్రధాని మోడీ ఆకాంక్షతో ప్రభుత్వం వివిధ వ్యవసాయ ఆధారిత మొబైల్ యాప్‌లను ప్రారంభించింది. వీటితో రైతులు ఇంట్లో నుంచి పలు సౌకర్యాలను పొందవచ్చు.. వారి పనిని సులభంగా చేసుకోవచ్చు. వీటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన.. PM కిసాన్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు అనేక సమస్యలకు పరిష్కారాలను పొందవచ్చు.

అన్ని సమస్యలకు పరిష్కారం..

PM కిసాన్ మొబైల్ అప్లికేషన్‌లో లబ్ధిదారుని స్థితిని తనిఖీ చేయడం నుంచి ఆధార్ వివరాలను సరిదిద్దడం, స్వీయ-నమోదు స్థితిని వీక్షించడం, స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కిసాన్ పథకం గురించి సమాచారం, హెల్ప్‌లైన్ నంబర్‌లు తదితర సమగ్ర వివరాలు దీనిలో ఉంటాయి. దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆన్లైన్ సెంటర్లకు వెళ్లనవసరం లేదని, ఇక నుంచి తమ ఇంటి వద్ద కూర్చొని రానున్న వాయిదాల సమాచారాన్ని పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మీరు కూడా రైతు అయి ఉండి.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరాలనుకుంటే ఇలా సెల్ఫ్-రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ మొబైల్‌లో ఇంట్లో కూర్చొని ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి పీఎం కిసం మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మొబైల్ యాప్ ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, మలయాళం, మరాఠీ, తమిళం, ఖాసీ, గారో, తదితర భాషల్లో రూపొందించారు.

రిజిస్ట్రేషన్ ఇలా..

ఇప్పుడు మీ భాషను ఎంచుకోండి. ఇప్పుడు యాప్‌లో కొత్త రైతు నమోదు లేదా కొత్త రైతుల నమోదు ఎంపికకు వెళ్లండి. మీ ఆధార్ కార్డ్‌ నంబర్‌ను నమోదు చేయండి. ఈ ప్రక్రియలో రైతుకు ఒక ఫారమ్‌ కనిపిస్తుంది. దానిని ఆన్‌లైన్‌లో నింపి సమర్పించాలి.

PM కిసాన్ యోజనలో చేరడానికి స్వీయ- నమోదు చేసుకుంటే, ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డ్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, మొబైల్ నంబర్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ల్యాండ్ పేపర్‌లతో పాటు (ఖస్రా, ఖాతౌనీ లేదా B-1 సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయండి), ID రుజువు.. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది.

ఎవరు అర్హులు..

2 హెక్టార్లు లేదా అంతకంటే తక్కువ భూమిని కలిగి ఉండి.. వ్యవసాయం చేసే రైతులు మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ యోజనకు అర్హులని గుర్తుంచుకోండి. దీంతో పాటు కొత్త రైతులకు రేషన్ కార్డు పత్రాన్ని కూడా తప్పనిసరి చేశారు. మీకు కావాలంటే, మరింత సమాచారం కోసం pmkisan.gov.in ని సందర్శించడం ద్వారా మీరు మరింత సమాచారాన్ని పొందవచ్చు.

సమస్యలుంటే ఇలా సంప్రదించండి..

PM కిసాన్ యోజనలో చేరడంలో లేదా ఈ పథకం వాయిదాలను పొందడంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే.. మీరు మీ సమస్యను pmkisan-ict@gov.in కు మెయిల్ చేయవచ్చు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌ (టోల్ ఫ్రీ) లను కూడా ప్రారంభించారు. 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు కాల్ చేయడం ద్వారా మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో సమస్యలను వివరించి ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..