FD Rates Hike: డిపాజిటర్లకు ఆ ఎన్ బీఎఫ్ సీ శుభవార్త.. ఫిక్స్ డ్ డిపాజిట్లకు ఏకంగా 9.36 శాతం వడ్డీ ఆఫర్
ఏ బ్యాంకు ఇవ్వని విధంగా ఏకంగా మహిళా సీనియర్ సిటిజన్లకు 9.36 శాతం వడ్డీని ఇస్తున్నట్టు శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించింది. అయితే పెంచిన వడ్డీ రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే సవరించిన వడ్డీ రేట్లు కేవలం 12 నుంచి 60 నెలల వ్యవధి ఉన్న డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
మనం చాాలా కష్టపడి సంపాదించిన సొమ్మును ఎలాంటి రిస్క్ లేకుండా ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని చూస్తుంటాం. అందువల్ల ఏ బ్యాంకు లేదా ఏ సంస్థ ఎక్కువ వడ్డీ ఇస్తుందో? అని వెతుకుతుంటాం. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న చర్యలతో అన్ని బ్యాంకులు తమ బ్యాంకులో రూ.2 కోట్ల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన ఖాతాదారులకు అధిక వడ్డీని ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పుడు అదే టాప్ ఎన్ బీఎఫ్ సీ కూడా చేరింది. ఏ బ్యాంకు ఇవ్వని విధంగా ఏకంగా మహిళా సీనియర్ సిటిజన్లు అయిన తమ ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాదారులకు 9.36 శాతం వడ్డీని ఇస్తున్నట్టు శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించింది. అయితే పెంచిన వడ్డీ రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే సవరించిన వడ్డీ రేట్లు కేవలం 12 నుంచి 60 నెలల వ్యవధి ఉన్న డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
మహిళా సీనియర్ సిటిజన్లకు పండగే..
ప్రస్తుతం మెజార్టీ బ్యాంకులు కేవలం సీనియర్ సిటిజన్లకే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు సంబంధించి లింగభేదం ప్రకారం ఎక్కువ వడ్డీని ఇవ్వలేదు. కానీ శ్రీరామ్ ఫైనాన్స్ మహిళా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్ ను ఆఫర్ చేస్తుంది. ఏకంగా 0.34 శాతం అధికంగా వడ్డీని అందిస్తుంది.
శ్రీరామ్ ఫైనాన్స్ అందించే వడ్డీ ఇలా
సాధారణ ప్రజలకు 12 కాలానికి ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే 7.3 శాతం వడ్డీ ఇస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.83, మహిళా సీనియర్ సిటిజన్లకు 8.21 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే ఈ వడ్డీ రేట్లు 18, 24, 30, 36, 42, 48, 60 నెలలకు సంబంధించి వేరుగా ఉన్నాయి. అయితే 60 నెలల కాలానికి సాధారణ ప్రజలకు 8.45 శాతం వడ్డీ ఇస్తే, సీనియర్ సిటిజన్లకు 8.99 శాతం, మహిళా సీనియర్ సిటిజన్లకు 9.36 శాతం వడ్డీని ఇస్తుంది.
శ్రీరామ్ ఫైనాన్స్ లో పెట్టుబడి సురక్షితమేనా?
శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ గ్రూప్ లో ఓ భాగం. ఇండియాలోని పెద్ద ఎన్ బీఎఫ్ సీల్లో శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఒకటి. అయితే ఎన్ బీఎఫ్ సీలు అందించే ఎఫ్ డీ లు ఆర్బీఐ నిబంధనలకు లోబడే ఉంటాయి. అయితే ఆర్బీఐ నిబంధనలు ప్రకారం సాధారణ బ్యాంకులు ఇచ్చే రూ.5 లక్షల డిపాజిట్ బీమా ఎన్ బీఎఫ్ సీలు ఇవ్వవు. కాబట్టి డిపాజిటర్లు పెట్టుబడి పెట్టే ముందుకు ఎన్ బీఎఫ్ సీ ల గురించి పూర్తి అవగాహనతో ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి