Maruti suzuki: సత్తా చాటిన మారుతి సుజుకీ.. గతేడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు..
ప్రముఖ దేశీ ఆటో మొబైల్ సంస్థ మారుతి సుజుకీ సత్తా చాటింది. గడిచిన ఏడాది కార్ల ఎగుమతుల్లో రికార్డు సృష్టించింది అరుదైన గుర్తుంపును సంపాదించుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'మేక్ ఇన్ ఇండియా' నినాద స్ఫూర్తితో మారుతి సుజుకీ ఈ ఘనతను సాధించింది. గతేడాది అత్యధికంగా ఎగుమతులు జరిగిన కార్లలో..
ప్రముఖ దేశీ ఆటో మొబైల్ సంస్థ మారుతి సుజుకీ సత్తా చాటింది. గడిచిన ఏడాది కార్ల ఎగుమతుల్లో రికార్డు సృష్టించింది అరుదైన గుర్తుంపును సంపాదించుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాద స్ఫూర్తితో మారుతి సుజుకీ ఈ ఘనతను సాధించినట్లు తెలిపింది. గతేడాది అత్యధికంగా ఎగుమతులు జరిగిన కార్లలో మారుతి సంస్థకు చెందిన డిజైర్, స్విఫ్ట్, ఎస్ ప్రెస్సో, బెలెనో, బ్రీజా కార్లు ఉన్నాయి.
2022లో మారుతి సుజుకీ ఇండియా ఏకంగా 2,63,068 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయడం విశేషం. 2021 ఏడాదితో పోల్చితే ఇది 28 శాతం అధికం. 2021లో మొత్తం 2,05450 కార్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. వరుసగా రెండేళ్లు కార్ల ఎగుమతులు 2 లక్షల మార్క్‌ను దాటడం మారుతి సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని మారుతి సుజుకీ ఇండియ లిమిటెడ్ మ్యానేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ హిశాహి టకేయుచి అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా నినాద స్ఫూర్తితోనే తాము ఈ ఘనతను సాధించినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే మారుతి సుజుకీ తొలిసారి 1986-87 సమయంలో కార్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది. మారుతి తొలిసారి హంగేరీకి కార్లను ఎగుమతి చేయగా ప్రస్తుతం ఏకంగా 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికాకు కార్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం మారుతం 16 మోడల్స్‌ను విదేశాలకు ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాయి. 2018లో 1,13,824 కార్లు ఎగుమతులు జరగగా, 2019లో ఈ సంఖ్య 1,07,190, 2020లో 85,208, 2021లో 2,05,450, 2022లో 2,63,068కి చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..