Ayushman Logo: దేశ ప్రజలకు కేంద్రం బంపరాఫర్.. రూ. లక్ష పొందే అవకాశం. పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల్లో దేశ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతలకు పేర్లను సూచించమని దేశ ప్రజలను కోరారు. ఇందుకు గాను మనీ ప్రైజ్‌ను కూడా అందిస్తూ ఔత్సాహికులను ప్రోత్సాహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారత...

కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల్లో దేశ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతలకు పేర్లను సూచించమని దేశ ప్రజలను కోరారు. ఇందుకు గాను మనీ ప్రైజ్‌ను కూడా అందిస్తూ ఔత్సాహికులను ప్రోత్సాహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారత ప్రభుత్వం దేశ ప్రజలకు మరో బంపరాఫర్‌ను ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ పథకానికి కొత్త లోగో డిజైన్‌ను సూచించాలని ప్రజలకు సూచించింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో పేద ప్రజలకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. 2021 అక్టోబర్ 25వ తేదీన ఆయుష్మాణ్ భారత్ పేరుతో పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన ప్రజలకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం అందిస్తారు. ఇప్పుడు ఈ పథకానికి కొత్త లోగోను డిజైన్ చేయాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. ఈ లోగోను పంపిణీ వారిలో ఉత్తమ లోగోకు ఎంపికైన విజేతకు రూ. లక్ష బహుమతిగా అందిస్తారు.
లోగో డిజైన్ చేయాలనే ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లోగోను సబ్మిట్ చేయడానికి జనవరి 12వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఈ పోటీలో 970కి పైగా మంది లోగోలను పంపించారు. గెలిచిన అభ్యర్థులకు రూ. లక్ష బహుమతిగా అందిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..