FD Interest Rates: పెరిగిన ఫిక్క్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. సీనియర్ సిటిజన్లకు పండుగే..
సీనియర్ సిటిజన్లు అయితే తమ శేష జీవితం మొత్తం తమ జీవితాంతం దాచుకునే డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంకా ఆచితూచి అడుగులేస్తారు. అయితే ప్రతి బ్యాంక్ ప్రస్తుతం ఆర్బీఐ చర్యలతో వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ రేట్ లు ఆఫర్ చేస్తున్నాయో? ఇప్పడు తెలుసుకుందాం.

ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలంటే అందరూ ఫిక్స్ డ్ డిపాజిట్ పైనే ఆధారపడతారు. ఏ బ్యాంక్ ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తుందో చూసుకుని పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే పెట్టుబడిపై వడ్డీతో పాటు అవసరమైనప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చే ధైర్యం ఉంటుందని నమ్మకం. అయితే సీనియర్ సిటిజన్లు అయితే తమ శేష జీవితం మొత్తం తమ జీవితాంతం దాచుకునే డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంకా ఆచితూచి అడుగులేస్తారు. అయితే ప్రతి బ్యాంక్ ప్రస్తుతం ఆర్బీఐ చర్యలతో ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ రేట్ లు ఆఫర్ చేస్తున్నాయో? ఇప్పడు తెలుసుకుందాం.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్
రెండు కోట్ల వరకూ దేశీయ డిపాజిట్లపై హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేట్లు కాల వ్యవధిని బట్టి 0.50 శాతం నుంచి 0.75 శాతం ఎక్కువుగా ఉన్నాయి. 7-14 రోజుల సాధారణ డిపాజిట్ పై 3 శాతం వడ్డీ రేట్ ఇస్తే.. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ రేట్ ను ఆఫర్ చేస్తుంది. అదే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణంగా 7 శాతం ఇస్తే సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది. 14 రోజుల నుంచి ఐదు సంవత్సరాల వివిధ కాల వ్యవధి డిపాజిట్లకు అనుగుణం వడ్డీ రేట్లల్లో వ్యత్యాసం ఉంది. అయితే ఈ పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్ 14 నుంచి అమల్లోకి వస్తాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ కూడా ఇటీవల తన వడ్డీ రేట్లను పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చాయి. 7-14 రోజుల సాధారణ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేట్ ఇస్తే..సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీ రేట్ అందిస్తుంది. అలాగే 5-10 సంవత్సరాల డిపాజిట్ల పై సాధారణంగా 6.25 శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం ఉంది. 14 నుంచి 5 సంవత్సరాల వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై కూడా వ్యత్యాసం ఉంది.




ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇటీవల తన వడ్డీ రేట్లను భారీగా పెంచింది. 7-14 రోజుల డిపాజిట్లపై 3 శాతానికి పెంచితే సీనియర్ సిటిజన్లకు 3.5 శాతానికి పెంచింది. 5-10 సంవత్సరాల డిపాజిట్ల పై సాధారణంగా 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తే..సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది. అయితే పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్ 16 నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే పెరిగిన వడ్డీ కూడా 2 కోట్ల కంటే తక్కువ ఉన్న దేశీయ డిపాజట్లకు మాత్రమే వర్తిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
కాల వ్యవధి తక్కువ ఉన్న డిపాజిట్లపై పీఎన్ బీ అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది. 7-14 రోజుల సాధారణ డిపాజిట్లపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అలాగే 5-10 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్లపై మాత్రం సాధారణంగా 7 శాతం ఇస్తే సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం ఇస్తుంది. అయితే పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్ 19 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్ బీ అధికారులు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి