Interest Rates: వడ్డీ రేట్ల పెంపులో బ్యాంకుల బాటలో నే ఇండియా పోస్ట్.. ఆ రెండు స్కీమ్స్ కు మాత్రం నో ఛేంజ్
గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం పోస్టాఫీస్ లను ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే టౌన్ కు వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే పోస్టాఫీస్ ఉండడంతో పెట్టుబడికి ముందుకొస్తారు. అలాగే పోస్టాఫీస్ లో డిపాజిట్ చేస్తే ప్రభుత్వ భరోసా ఉంటుందనే నమ్మకంతో ఎక్కువ మంది పోస్టాఫీస్ లో డిపాజిట్ చేస్తారు. ప్రస్తుతం అన్ని బ్యాంకుల తరహాలోనే ఇండియా పోస్ట్ తన వడ్డీ రేట్లేను సవరించింది.

కచ్చితమైన రాబడి కోసం అంతా ఎంచుకునే పెట్టుబడి సాధనం ఫిక్స్ డ్ డిపాజిట్లు. పట్టణ ప్రాంతాల్లో అయితే దాదాపు అంతా బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం పోస్టాఫీస్ లను ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే టౌన్ కు వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే పోస్టాఫీస్ ఉండడంతో పెట్టుబడికి ముందుకొస్తారు. అలాగే పోస్టాఫీస్ లో డిపాజిట్ చేస్తే ప్రభుత్వ భరోసా ఉంటుందనే నమ్మకంతో ఎక్కువ మంది పోస్టాఫీస్ లో డిపాజిట్ చేస్తారు. ప్రస్తుతం అన్ని బ్యాంకుల తరహాలోనే ఇండియా పోస్ట్ తన వడ్డీ రేట్లేను సవరించింది. పెరిగిన వడ్డీ రేట్లు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయి.
పెరిగిన వడ్డీ రేట్లు ఇవే
సేవింగ్స్ ఖాతాకు 4 శాతం, వన్ ఇయర్ టెర్మ్ డిపాజిట్ కు 6.6 శాతం, 2 సంవత్సరాలకు 6.8 శాతం, మూడు సంవత్సరాలకు 6.9 శాతం, ఐదు సంవత్సరాలకు 7.0 శాతం వడ్డీని పెంచింది. అయితే 5 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న రికరింగ్ డిపాజిట్లకు 5.8 శాతం, మంత్లీ ఇన్ కమ్ అకౌంట్ స్కీమ్ కు 7.1 శాతం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ సీ) కు 7.0 శాతం, కిసాన్ వికాస్ పత్రానికి 7.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే తన గ్రామీణ ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8 శాతం వడ్డీని ఇస్తుంది. కానీ పబ్లిక్ పావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పీపీఎఫ్ కు ప్రస్తుతం 7.1 శాతం, సుకన్య సమృద్ధి అకౌంట్లకు 7.6 శాతం వడ్డీ వస్తుంది.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..



