Post Office Schemes: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో భార్యాభర్తలిద్దరూ చేరితో నెలకు రూ.4950

చేతిలో డబ్బులు ఉండి ఎందులోనైనా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని భావించే వారికి పోస్టాఫీసుల్లో మంచి అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖలో..

Post Office Schemes: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో భార్యాభర్తలిద్దరూ చేరితో నెలకు రూ.4950
Post Office Schemes
Follow us
Subhash Goud

|

Updated on: Nov 19, 2022 | 8:42 AM

చేతిలో డబ్బులు ఉండి ఎందులోనైనా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని భావించే వారికి పోస్టాఫీసుల్లో మంచి అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖలో రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్‌లు ఎన్నో ఉన్నాయి. పోస్టాఫీసులో ఎన్నో ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయి. ఇందులో భార్యాభార్తలిద్దరూ నెలనెల సంపాదించే పథకం ఒకటి ఉంది. ఈ పథకం ద్వారా వారు వార్షికంగా రూ.59,400 వరకు రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌ పేరు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌. ఈ స్కీమ్‌ ద్వారా ప్రతినెల గరిష్టంగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌ ద్వారా నెలనెల రూ.4950 వరకు పొందవచ్చు.

ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ కింద భార్య, భర్త ఇద్దరూ ప్రతినెల కొంత డబ్బులు పొందవచ్చు. ఈ పథకంలో చేరితే జాయింట్‌ అకౌంట్‌ను తెరవవచ్చు. జాయింట్ అకౌంట్ ద్వారా అయితే ఈ అకౌంట్లో డబ్బులు రెట్టింపు అవుతాయి. ఈ పథకంలో కనీసం రూ.1000 ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వేళ జాయింట్‌గా అకౌంట్‌ను తీసినట్లయితే గరిష్టంగా రూ.69 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్లకు ఈ స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ స్కీమ్‌ కింద పోస్టాఫీసులో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్‌ అకౌంట్‌ను తెరవవచ్చు. అయితే జాయింట్‌ అకౌంట్‌ తీసిన తర్వాత ఏ సమయంలోనైనా సింగిల్‌గా మార్చుకునే వెసులుబాటు ఉంది. అలాగే సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా కూడా మార్చుకునే సదుపాయం ఉంది. జాయింట్‌ అకౌంట్‌ తీసిన తర్వాత ఏదైనా మార్పులు చేయాలంటే అకౌంట్‌ సభ్యులందరూ అప్లికేషన్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్‌లో వడ్డీ ఎంత?

ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వారికి వార్షికంగా 6.6 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. మీ డిపాజిట్లపై పొందిన వార్షిక వడ్డీరేటు ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు మీరు జాయింట్‌ అకౌంట్‌లో రూ.9 లక్షలు డిపాజిట్‌ చేస్తే మొత్తం వడ్డీ కలుపుకొని ఏడాదికి రూ.59,400 అందుకుంటారు. ఈ మొత్తాన్ని 12 భాగాలుగా విభజిస్తే ప్రతి నెల రూ.4950 అందుకోవచ్చు. పథకం మెచ్యూరిటీ ఐదేళ్లు. అవసరం అనుకుంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.