Bank Strike: ఖాతాదారులకు అలెర్ట్.. బ్యాంకుల సమ్మె విరమణ.. వివరాలివే
శనివారం(నవంబర్ 19) దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య అలెర్ట్. శనివారం(నవంబర్ 19) దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సమ్మెను విరమిస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్స్ ఆఫ్ అసోసియేషన్.. చాలావరకు తమ డిమాండ్లను పరిష్కరించినందున సమ్మెను విరమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగనున్నాయి. క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్ క్లియరెన్స్, ఏటీఎం సేవలు ఇలా అన్నింటికి ఎలాంటి అంతరాయం ఉండదు.
‘అన్ని సమస్యలపై అవగాహన కుదిరింది. సమస్యను పరిష్కరించేందుకు ఐబీఏ, బ్యాంకులు అంగీకారం తెలిపాయి. చర్చల ద్వారా అన్నింటిని పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో సమ్మెను విరమిస్తున్నాం’ అని ఏఐబీఈఏ నరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.