Life Certificate: మీరు ఈపీఎస్ పింఛనుదారులా? లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్‌పై కీలక ప్రకటన

జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడానికి కొంత మంది పెన్షనర్లకు గడువు నుండి మినహాయింపు ఇవ్వబడింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి నవంబర్..

Life Certificate: మీరు ఈపీఎస్ పింఛనుదారులా? లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్‌పై కీలక ప్రకటన
5 సంవత్సరాలకు ముందు ఉపసంహరణపై, ఉపసంహరణ మొత్తం 50 వేల వరకు ఉన్నప్పటికీ పన్ను మినహాయింపు ఉండదు. ఉపసంహరణ మొత్తం 50 వేల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు కాల వ్యవధి ప్రకారం TDS విధించరు. మినహాయింపు ఉంటుంది.
Follow us
Subhash Goud

|

Updated on: Nov 18, 2022 | 10:27 AM

జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడానికి కొంత మంది పెన్షనర్లకు గడువు నుండి మినహాయింపు ఇవ్వబడింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి నవంబర్ 30 చివరి రోజుగా ఉండగా, ఈపీఎఫ్‌వో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్‌) 1995 కింద వచ్చే వారికి ఈ గడువు వర్తించదు . ఈపీఎఫ్‌వో అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. పెన్షనర్లు తమకు కావలసినప్పుడు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఇది సమర్పించిన తర్వాత ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.

‘ఈపీఎస్‌ 95’ కింద పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటవుతుంది అని ఈపీఎఫ్‌వో​ట్వీట్ చేసింది. గతేడాది డిసెంబర్ 31న లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినట్లయితే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు సమర్పిస్తే సరిపోతుంది. మీరు 31 డిసెంబర్ గడువులోగా ఫైల్ చేయకపోతే 2023 జనవరి 1 నుండి పెన్షన్ నిలిపివేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు పింఛనుదారులు నవంబర్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉండేది. ఇది పింఛనుదారులకు పెద్ద సమస్యగా మారనుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించడానికి ప్రజలు క్యూలలో వేచి ఉండాల్సి వచ్చింది.

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎక్కడ సమర్పించాలి?

  • పెన్షన్ పంపిణీ బ్యాంక్
  • కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)
  • ఐపీపీబీ/ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ / పోస్ట్ మ్యాన్
  • ఉమంగ్ యాప్
  • సమీప ఈపీఎఫ్‌వో​కార్యాలయం

లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి అవసరమైన పత్రాలు ఏమిటి?

  • పీపీవో నంబర్‌
  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ ఖాతా వివరాలు
  • మొబైల్ ఫోన్ నంబర్ (ఆధార్‌తో లింక్ చేయబడింది)

  • ‘ఈపీఎస్‌ 1995’ అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇందుకోసం నెలకు రూ.15,000 వరకు ఉద్యోగి జీతంలో యజమాని 8.33 శాతం, జీతంలో 1.16 శాతం కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధంగా సేకరించిన మొత్తం నుండి పథకం కింద అన్ని రకాల ప్రయోజనాలు అందించబడతాయి. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏపీఎస్‌ నియమాలు, 1995లోని 32వ పేరాలో పేర్కొన్న విధంగా ఈ పథకం తప్పనిసరి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్