PM Kisan: నవంబర్ 30 నాటికి రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. రాకపోతే ఇలా ఫిర్యాదు చేయండి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్న కోట్లాది మంది రైతులకు మరో అప్‌డేట్ ఉంది. రైతుల ఖాతాలో 12 విడతల డబ్బులు..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్న కోట్లాది మంది రైతులకు మరో అప్‌డేట్ ఉంది. రైతుల ఖాతాలో 12 విడతల డబ్బులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇటీవల 12వ విడత డబ్బును కోట్లాది మంది రైతుల ఖాతాలకు బదిలీ చేసిందని, అయితే ఇప్పటి వరకు దేశంలోని లక్షలాది మంది రైతులకు డబ్బులు ఈ విడత డబ్బులు అందలేదని తెలుస్తోంది. ఈ డబ్బులు అందని రైతులకు నవంబర్ 30వ తేదీలోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారుల ద్వారా సమాచారం.
డబ్బులు రాకుంటే ఫిర్యాదు చేయవచ్చు..
ఇప్పటి వరకు పీఎం కిసాన్ డబ్బులు రాని రైతులు వ్యవసాయ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 30వ తేదీ నాటికి వారి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని, ఒక వేళ రాని పక్షంలో ఫిర్యాదు చేయవచ్చు.
రైతులు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు:
పీఎం కిసాన్ డబ్బులు రాని రైతులు హెల్ప్‌లైన్ నంబర్ 155261 / 011-24300606కు కాల్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితి గురించి తెలుసుకోవచ్చు. మీరు పీఎం కిసాన్ యోజన టోల్ ఫ్రీ నంబర్ 18001155266 లేదా డైరెక్ట్ హెల్ప్‌లైన్ నంబర్ 011-23381092లో కూడా సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి