Rented House vs Own House: అద్దె ఇల్లు – సొంతిల్లు.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..సొంతింటితో కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..
సొంతిల్లు అనేది చాలా మంది కళ.. ఏమి ఉన్నా లేకపోయినా.. ఓ ఇల్లు ఉంటే చాలు.. గంజి తినైనా బతకొచ్చనుకుంటారు. సామాన్య తరగతి ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. సొంతిల్లు ఉంటే.. కొన్నాళ్లకి.. వచ్చే సంపాదనలో ఎంతో కొంత..
సొంతిల్లు అనేది చాలా మంది కళ.. ఏమి ఉన్నా లేకపోయినా.. ఓ ఇల్లు ఉంటే చాలు.. గంజి తినైనా బతకొచ్చనుకుంటారు. సామాన్య తరగతి ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. సొంతిల్లు ఉంటే.. కొన్నాళ్లకి.. వచ్చే సంపాదనలో ఎంతో కొంత పొదుపు చెయ్యొచ్చు. లేదంటే జీవితాంతం అద్దెలు కడుతూ.. జీవనం సాగించాలి. అందుకే తమ జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకున్న వారు మొదట ఇళ్లు కొనేందుకు ప్రయారటీ ఇస్తారు. మరికొంతమంది సరైన గైడెన్స్ లేక ఎప్పటికి తమ సొంతింటి కళను నెరవేర్చుకోలేరు. కొంతమందికి సొంతిల్లు కొనడం భారం కావచ్చు. కాని ఏదైనా స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టడం ద్వారా.. భవిష్యత్తులో వాటిని విక్రయించి.. సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. స్థిరిస్తి కొనుగోలు చేయాలన్నా సరైన గైడెన్స్ మాత్రం ఎంతైనా అవసరం. ఏది ఏమైనా సొంతింట్లో ఉన్న కంపార్ట్‌బులిటీ అద్దె ఇంట్లో ఉండదనే చెప్పుకోవాలి. ముందుగా సొంతింటికి, అద్దె ఇంటికి గల తేడాలు.. సొంతిల్లుతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
సౌకర్యవంతం
సొంతిల్లు ఎంతైనా సౌకర్యవంతంగా ఉంటుంది. మనమే యజమాని కాబట్టి ఫంక్షన్ల సమయంలో బంధువులు ఎంతమంది వచ్చినా అడ్జెస్ట్ అవ్వొచ్చు. చిన్న చిన్న పంక్షన్లు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. యజమాని అధిమాయిషీ అంటూ ఉండదు. అదే అద్దె ఇంట్లో అయితే ఇతరుల అభిరుచులకు అనుగుణంగా, వారు పెట్టే నిబంధనలను పాటిస్తూ జీవించాలి.
పొదుపు
అద్దె ఇంట్లో ఉంటే ప్రతినెలా అద్దె కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ వంటి నగరంలో ఓ మధ్యతరగతి కుటుంబం కనీస సౌకర్యాలతో అద్దె ఇంట్లో ఉండాలంటే రూ.10వేల వరకు అద్దె ఉంటుంది. సొంతిల్లు ఉంటే ఆ డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసినా.. అద్దెకు చెల్లించే డబ్బులతో బ్యాంకు రుణం చెల్లించవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత.. రుణం తీరిపోయాక.. నెలకు పది నుంచి పది హేను వేల రూపాయలను పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రైవసీ
సొంతింట్లో ఉండటం ద్వారా మనకు కావల్సిన ప్రైవసీ ఉంటుంది. ఇంటిని మనకు కావల్సినట్లు మార్చుకోవచ్చు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటే.. ఎన్నాళ్లు అక్కడ ఉంటాం అనే గ్యారంటీ ఉండదు. ఇళ్లు మారేటప్పుడు సామాన్లు తరలింపు పెద్ద సమస్యగా మారుతుంది. ఏసీ లాంటివి అన్ ఇన్ స్టాల్ చేసి మరోచోట ఇన్‌స్టాల్ చేయాలంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సొంతిల్లు ఉంటే ఇలాంటి సమస్యలు ఉండవు.
చాలామందికి కొనుగోలు సామర్థ్యం ఉన్నా సొంతిల్లు, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి సరైన సమాచారం లభించదు. ఏ ప్రాంతంలో గృహల ధరలు ఎలా ఉన్నాయి.. భవిష్యత్తులో ఏ ప్రాంతంలో స్థిరాస్తులకు డిమాండ్ పెరుగుతుందనే విషయాలు తెలియక రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి జంకుతారు. అలాంటివారికి ఓ మంచి అవకాశం కల్పిస్తోంది టీవీ9. హైదరాబాద్‌లో ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో జరగనుంది. ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించే TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పోను సందర్శించండి. అత్యంత విశ్వసనీయమైన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..