AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Real Estate: నగరాల్లో పెరుగుతున్న గృహ విక్రయాలు.. హైదరాబాద్‌లో స్థిరాస్తుల సమస్త సమాచారం మీ కోసం..

కోవిడ్ కారణంగా గృహ, స్థిరాస్తి కొనుగోలు కొంతమేర మందగించాయి. కరోనా ప్రభావం తగ్గడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు.. సిటీ పరిసరాల్లో అందరికీ..

Hyderabad Real Estate: నగరాల్లో పెరుగుతున్న గృహ విక్రయాలు.. హైదరాబాద్‌లో స్థిరాస్తుల సమస్త సమాచారం మీ కోసం..
Real Estate
Amarnadh Daneti
|

Updated on: Nov 15, 2022 | 7:28 PM

Share

కోవిడ్ కారణంగా గృహ, స్థిరాస్తి కొనుగోలు కొంతమేర మందగించాయి. కరోనా ప్రభావం తగ్గడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు.. సిటీ పరిసరాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా.. సరసమైన ధరల్లో ఎన్నో స్థిరాస్తులు అందుబాటులో ఉన్నాయి. గృహ రుణాలు ఇవ్వడం సులభతరం కావడంతో పాటు.. దానికి కావల్సిన ప్రాసెస్‌ చేయడానికి అవసరమైన సహకారాన్ని స్థిరాస్తి సంస్థలు అందిస్తుండటంతో గృహ విక్రయాలు ఇటీవల కాలంలో పెరుగతున్నాయి. ఈ ఏడాది గృహ విక్రయాలు ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు 3,60,000కు చేరుకోనున్నాయని అంచనా. అంటే వ్యక్తిగతంగా ఇళ్లు కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది సరైన సమాచారం, గైడెన్స్ లేకపోవడం వల్ల కొనే సామర్థ్యం ఉన్నప్పటికి.. అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పూణేలలో గృహాల విక్రయాలు 2014లో 3,42,980 యూనిట్లుగా నమోదుకాగా.. ఈ ఏడాది 3,60,000 మార్క్‌ను దాటనుందని అంచనా. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు 2,72,710 యూనిట్లకు చేరుకోగా.. 2019 ఏడాది జరిగిన విక్రయాలు 2,61,360 యూనిట్లతో పోలిస్తే ఈఏడాదిలో ఇప్పటివరకు జరిగిన విక్రయాలు ఎక్కువుగా ఉన్నాయి. దేశంలో రెసిడెన్షియల్ ప్రొపర్టీ మార్కెట్ ఈ ఏడాది అధిక విక్రయాలతో చరిత్ర సృష్టించనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

కొంతమంది సొంత గృహం ఉన్నప్పటికి.. పొదుపు కోసం అనేక మార్గాలను ఎంచుకుంటారు. కాని సరైన సమాచారం తెలుసుకుని స్థిరాస్తులపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో వాటి ధరలు పెరిగి మనం పెట్టిన పెట్టుబడిపై మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే చాలా మంది తక్కువ ధరలో వస్తున్నాయని, సరైన సమాచారం తెలుసుకోకుండా.. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టపోతుంటారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్‌లో ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రియల్‌ ఎస్టేట్ ఎక్స్‌పో జరగనుంది.

ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించే TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పోను సందర్శించండి. అత్యంత విశ్వసనీయమైన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..