AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: ఉద్యోగులకు ట్విట్టర్ సీఈవో షాక్.. ఆ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటన..

Twitter CEO, Elon Musk, Twitter employees, Twitter employees, policy, Tesla, SpaceX, Musk,

Twitter: ఉద్యోగులకు ట్విట్టర్ సీఈవో షాక్.. ఆ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటన..
Elon Musk, Twitter
Amarnadh Daneti
|

Updated on: Nov 15, 2022 | 9:42 PM

Share

ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన తర్వాత వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఎలాన్ మస్క్.. తాజాగా ఉద్యోగులకు మరో షాకిచ్చారు. ట్విట్టర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు లేఖ రాశారు. కరోనా సమయంలో ట్విట్టర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశారని ఎలోన్ మస్క్ తెలిపారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలన్నారు. ఉద్యోగులు కనీసం వారానికి 40 గంటల పాటు ఆఫీసులో తప్పనిసరిగా పనిచేయాలని ఆదేశించారు.ట్విట్టర్ సంస్థను మరింత అభివృద్ధిలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని ఎలాన్ మస్క్ అన్నారు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికైనా ఆఫీసులకు వచ్చేందుకు ఇబ్బందిగా అనిపిస్తే రాజీనామా చేయవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ సహ ఉద్యోగులు ఉన్న దగ్గర నివసించాలన్నారు. టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల్లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కఠిన నిబంధల అమలు చేస్తున్నందు వల్లే ఈ రెండు సంస్థలు నెంబర్ వన్ గా ఉన్నాయని చెప్పారు. లేదంటే ఎప్పుడో దివాళా తీసి ఉండేవని తెలిపారు.

మరోవైపు ఎలన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి రోజూ ఆ సంస్థ వార్తలో నిలుస్తోంది. ఆయన తీసుకంటున్న పలు నిర్ణయాలు వివాదస్పదం అవుతున్నాయి. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోనికి సింక్ తో ప్రవేశించి.. సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఉద్యోగుల తొలగింపు మొదలు బ్లూటిక్ వరకు ఎలాన్ మస్క్ నిర్ణయాలు అన్ని పలు వివాదాలకు దారితీస్తూనే ఉన్నాయి. ఏకంగా ట్విట్టర్ సీఈవోనే బాధ్యతల నుంచి తొలగించారు. అలాగే అనేక ఉన్నతస్థాయి ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగించారు. తాజాగా ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ విషయం వివాదానికి కారణమైంది. దీంతో ట్విట్టర్ వినియోగదారుల భద్రతకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో ఈ విషయంలో ట్విట్టర్ వెనక్కి తగ్గింది.

ఇవి కూడా చదవండి

ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’ను ప్రీమియం సర్వీసుగా మార్చారు ఎలాన్‌ మస్క్. ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. దీనివల్ల నకిలీ ఖాతాలు ఎక్కువుగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేశారు. ప్రముఖ కంపెనీలు, వ్యక్తుల పేరుతో ట్విట్టర్ ఖాతాలు సృష్టించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడంతో అసలు, నకిలీ ఖాతాలు గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఈ విషయంలో సంస్థ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..