UPI Payment: డెబిట్‌ కార్డుకు బదులు ఆధార్‌ కార్డుతో యూపీఐ సెటప్‌.. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం..

నగదు రహిత లావాదేవీల్లో భాగంగా యూపీఐ సేవలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అందరికీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్ ఛార్జీలు సైతం భారీగా తగ్గడంతో ఈ సేవలను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద మాల్స్‌ వరకు యూపీఐ..

UPI Payment: డెబిట్‌ కార్డుకు బదులు ఆధార్‌ కార్డుతో యూపీఐ సెటప్‌.. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం..
Upi Aadhar Card
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 16, 2022 | 5:41 PM

నగదు రహిత లావాదేవీల్లో భాగంగా యూపీఐ సేవలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అందరికీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్ ఛార్జీలు సైతం భారీగా తగ్గడంతో ఈ సేవలను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద మాల్స్‌ వరకు యూపీఐ ద్వారా డబ్బులను స్వీకరిస్తున్నారు. దీంతో చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే యూపీఐ సేవలను యాక్టివేట్ చేసుకోవాలంటే కచ్చితంగా డెబిట్‌ కార్డ్‌ ఉండాలనే విషయం తెలిసిందే.

డెబిట్‌ కార్డ్‌ నెంబర్‌ ద్వారానే యూపీఐని యాక్టివేట్ చేసుకుంటాం. అయితే డెబిట్ కార్డ్‌ అవసరం లేకుండా ఆధార్‌ కార్డుతో కూడా యూపీఐని యాక్టివేట్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇందుకోసం.. ఆధార్‌ కార్డులో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నెంబర్‌, బ్యాంకు ఖాతాకు లింక్‌ చేసిన మొబైల్‌ నెంబర్‌ ఒకటే అయి ఉండాలి. ఇంతకీ ఆధార్‌ కార్డుతో యూపీఐ సేవలను ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చనేగా మీ సందేహం. అందుకోసం ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే సరి..

* ముందుగా మీ ఫోన్‌లో ఉన్న ఏదైనా యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం యాప్‌లో ఉండే ‘యాడ్‌ యూపీఐ ఐడీ’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

* అనంతరం అందులో కనిపించే ‘ఆధార్‌ బేస్‌డ్‌ వెరిఫికేషన్‌’ను సెలక్ట్ చేసుకొని యాక్సెప్ట్‌ అండ్‌ అగ్రీ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత మీ ఆధార్‌ కార్డులో మొదటి 6 నెంబర్లను ఎంటర్‌ చేయాలి.

* వెంటనే మీ మొబైల్‌ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో మీ యూపీఐ యాక్టివేట్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే