Bank Holidays: డిసెంబర్‌ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు జరిపే వారు ముందస్తుగా అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఏయే రోజుల్లో ..

Bank Holidays: డిసెంబర్‌ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..
Bank Holidays
Follow us
Subhash Goud

|

Updated on: Nov 18, 2022 | 9:47 AM

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు జరిపే వారు ముందస్తుగా అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో ముందస్తుగా తెలుసుకోవడం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక డిసెంబర్‌ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని పెండింగ్‌లో ఉంటే, బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేయండి. అయితే బ్యాంకుల పని ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చేసే పని సులభంగా చేయవచ్చు. 4 ఆదివారాలు కాకుండా, డిసెంబర్‌లో వచ్చే సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంటుంది.

డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులు:

  1. డిసెంబర్ 3 – శనివారం – సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ – గోవాలో బ్యాంకు మూసివేత
  2. డిసెంబర్ 4 – ఆదివారం
  3. డిసెంబర్ 10 – రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
  4. డిసెంబర్ 11 – ఆదివారం
  5. డిసెంబర్ 12 – సోమవారం – పా-టాగన్ నెంగ్మింజ సంగం – మేఘాలయలో బ్యాంక్ మూసివేయబడింది
  6. డిసెంబర్ 18 – ఆదివారం
  7. డిసెంబర్ 19 – సోమవారం – గోవా విమోచన దినం – గోవాలో బ్యాంకు మూసివేయబడింది
  8. డిసెంబర్ 24 – శనివారం – క్రిస్మస్, నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకు మూసివేయబడతాయి.
  9. డిసెంబర్ 25 – ఆదివారం
  10. డిసెంబర్ 26 – సోమవారం – క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ – మిజోరం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకు మూసివేయబడతాయి.
  11. డిసెంబర్ 29 – గురువారం – గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు – చండీగఢ్‌లో బ్యాంక్ మూసి ఉంటుంది.
  12. డిసెంబర్ 30 – శుక్రవారం – యు కియాంగ్ నంగ్వా – మేఘాలయలో బ్యాంక్ మూసి ఉంటుంది.
  13. డిసెంబర్ 31 – శనివారం – నూతన సంవత్సర వేడుకలు – మిజోరంలో బ్యాంకు మూసి ఉంటుంది.

ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు:

కొన్ని బ్యాంకు సెలవులు జాతీయమైనవి. ఆ రోజున దేశం మొత్తం బ్యాంకుల్లో సెలవు ఉంటుంది. ఇది కాకుండా, రాష్ట్రాల పండుగల ఆధారంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. జాతీయ స్థాయిలో డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో బ్యాంకులు ఏకకాలంలో మూసి ఉంటాయి. డిసెంబర్ 24న, క్రిస్మస్, నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..