Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఆ ఎక్స్‌ప్రెస్‌ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌ - ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్‌ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌ పేరును మార్చింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఆ ఎక్స్‌ప్రెస్‌ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం..
Indian Railways
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 03, 2023 | 9:32 AM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌ – ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్‌ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌ పేరును మార్చింది. అహ్మదాబాద్‌ – ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి రైలు పేరును అక్షరధామ్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం ప్రకటించారు. స్వామినారాయణ్ సంస్థ ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామి మహరాజ్‌కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) సంస్థ ఆధ్యాత్మిక గురువుకు నివాళులర్పిస్తూ పేరును మార్చినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఈ రైలు ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ దేవాలయాలను కలుపుతుందని తెలిపిన అశ్విని వైష్ణవ్.. స్వామి నారాయణ సంస్థ చేస్తున్న సేవలకు ఇది చిరుకానుక అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రముఖ్ స్వామి జన్మదిన వేడుకలకు రైల్వే మంత్రి హాజరై ప్రసంగించారు. అహ్మదాబాద్ నగరంలో 600 ఎకరాల విస్తీర్ణంలో నెల రోజుల పాటు ప్రముఖ్ స్వామి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు.

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

అహ్మదాబాద్‌ – ఢిల్లీ మధ్య 2005లో మార్చిలో సంపర్క్‌ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌ తొలి సర్వీసు ప్రారంభమైంది. ఈ రైలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. 1074 కిలోమీటర్ల పాటు ప్రయాణించే ఈ 17 గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..