Viral Video: మెట్రో రైలుతో రేసింగ్ పెట్టుకున్న యువకుడు.. కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్.. వీడియో వైరల్..

వైరల్ క్లిప్‌లో.. ఓ యువకుడు మెట్రో రైలుతో రేసింగ్ పోటీ పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Viral Video: మెట్రో రైలుతో రేసింగ్ పెట్టుకున్న యువకుడు.. కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్.. వీడియో వైరల్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2023 | 7:41 PM

కొన్నిసార్లు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు చూస్తే షాక్ తింటాము. అంతేకాదు ఇది నిజమేనా అని ఆలోచిస్తాం.. కళ్ళు చెదిరిపోతాయి కూడా.. ప్రస్తుతం మెట్రో రైలులో ఓ ప్రయాణికుడు సృష్టించిన అద్భుతం వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.  వైరల్ క్లిప్‌లో.. ఓ యువకుడు మెట్రో రైలుతో రేసింగ్ పోటీ పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. 47 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. మెట్రోతో రేసింగ్ చేస్తున్న యువకుడిని చూడవచ్చు. 1 నిమిషం 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక యువకుడు మెట్రో రైలు నుండి దిగి స్టేషన్ నుండి తదుపరి స్టాప్ వరకు ఎలా పరిగెత్తాడో  చూడవచ్చు. ఇలా రైలుతో పోటీపడి పరిగెత్తిన ఆ యువకుడు .. నెక్స్ట్ స్టాప్‌లో అదే రైలు క్యాచ్ చేశాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే..  అతను తదుపరి స్టాప్‌ వరకూ పరుగెత్తి.. అదే రైలులోని అదే బోగీలో ఎక్కాడు. ఈ వీడియో లండన్ మెట్రో రైల్ కు సంబంధించినదిగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మెట్రో కంటే వేగంగా పరిగెత్తిన ప్రయాణికుడు 

ఈ వీడియో మొదటిసారిగా పెపో జిమెనెజ్ అనే వినియోగదారు ద్వారా మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో షేర్ చేశాడు. ఇటీవల @ValaAfshar హ్యాండిల్‌తో దీన్ని మళ్లీ షేర్ చేశారు.  క్షణాల్లో వైరల్‌గా మారింది. వినియోగదారు క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు, ‘ఈ వ్యక్తి రైలు నుండి దిగాడు. తదుపరి స్టాప్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, అదే రైలులో తన సొంత సీటులో కూర్చున్నాడు. ఈ వీడియో 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను 5 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. అనేక మంది నెటిజన్లు తమ ఫీలింగ్స్ ను కామెంట్ రూపంలో వ్యక్తం చేశారు. ఈ వ్యక్తి మెట్రో కంటే వేగంగా పరిగెత్తడాని ఒక వినియోగదారుడు కామెంట్ చేశాడు. అదే సమయంలో.. మరొకరు ఇది నిజంగా అద్భుతమైన వీడియో.. అయితే ఆ యువకుడు నిజంగా అలా చేశాడని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. మరొకరు సోదరుడి స్టామినా అద్భుతమైనదని ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తానికి ఈ వీడియో జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..