Crime Video: ‘అమ్మా’నుషం.. ఇద్దరు పిల్లలను వాగులో పడేసిన తల్లి.. ఎందుకమ్మా ఇలా చేసావ్.. వీడియో.
నిజామాబాద్ లో దారుణఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. పేగు బంధాన్నే
నిజామాబాద్ లో దారుణఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. పేగు బంధాన్నే మరిచి తన కబంధ హస్తాలతో చిన్నారులిద్దరినీ వాగులో పడేసింది ఆ తల్లి.. నాగారం చక్రనగర్ తండాకు చెందిన అరుణకు.. మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన మోహన్ తో పెళ్లయింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పెట్టే ఇబ్బందులు తాళలేక అరుణ పుట్టింటికి వచ్చింది. రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త మోహన్ ఫోన్ చేశాడు. ఉద్గీర్ వచ్చేయాలని కోరాడు. దీంతో ఆమె భర్త వద్దకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో చక్రనగర్ తండా నుంచి బయలుదేరింది. దారిలో బాన్సువాడ శివారులో ఉన్న వాగు వద్దకు వెళ్లింది. చిన్నారులిద్దరినీ అందులో పడేసింది. ఘటనను చూసిన స్థానికులు.. వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారులను బయటకు తీశారు. చికిత్స అందించేందుకు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశారు. నిజామాబాద్ నుంచి ఆటోలో వస్తుండగా డ్రైవర్ తనపై అఘాయిత్యం చేయడంతో పిల్లలను వాగులో పడేసినట్లు అరుణ వారికి తెలిపింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా.. వాగు వద్ద ఆటో కానీ, డ్రైవర్ కానీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాల కోసం వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వైరల్ వీడియోలు
Latest Videos