Delhi: అత్యాచారం చేసిన వ్యక్తిపై పగ.. నిందితుడి తల్లిని గన్‌తో కాల్చిన మైనర్ బాలిక..

దేశ రాజధానిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పగ పెంచుకున్న బాలిక(16).. అతని తల్లిని తుపాకీతో కాల్చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో

Delhi: అత్యాచారం చేసిన వ్యక్తిపై పగ.. నిందితుడి తల్లిని గన్‌తో కాల్చిన మైనర్ బాలిక..
Gun Firing
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 08, 2023 | 3:49 PM

దేశ రాజధానిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పగ పెంచుకున్న బాలిక(16).. అతని తల్లిని తుపాకీతో కాల్చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మైనర్ బాలిక పిస్టల్ తీసుకుని మహిళ తలపై కాల్చింది. బాధిత మహిళ కిరాణా దుకాణం నడుపుతుండగా.. ఆమె వద్దకు వెళ్లి తుపాకీతో కాల్చింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాగా, మహిళను తుపాకీతో కాల్చిన మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు కాల్చిందా? అని ఆరా తీస్తే.. షాకింగ్ విషయం వెలుగు చూసింది. 2021లో మైనర్ బాలికపై మహిళ కొడుకు, తను కూడా మైనరే(17) అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంలో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి(IPC), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(POCSO) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, తనపై అత్యాచారం చేసిన బాలుడు బెయిల్‌పై బయటకు వచ్చి యధేచ్చగా తిరుగుతుండటంతో బాలికలో ఆగ్రహం పెరిగింది. పగతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే తుపాకీ తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లింది. అక్కడ నిందితుడి తల్లి ఉండటంతో ఆమెపై కాల్పులు జరిపింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలోనూ..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక తన ప్రియుడి సహాయంతో కన్నతల్లినే చంపేసింది. అమ్మాయి తన తల్లికి నిద్రమాత్రలు కలిపిన ఆహారం ఇచ్చింది. ఆమె నిద్రమత్తులోకి జారుకోగానే.. తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి కత్తితో మహిళ గొంతు కోసేశారు. అనంతరం కడుపులో పొడిచి చంపేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..