Uttar Pradesh: లక్నోలో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ నేత మనీష్ అరెస్ట్. ఆందోళనకు దిగిన మాజీ సీఎం..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించారు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు. ఎస్పీ సోషల్ మీడియా హెడ్ మనీష్ జగన్ అగర్వాల్ అరెస్ట్‌ను..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించారు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు. ఎస్పీ సోషల్ మీడియా హెడ్ మనీష్ జగన్ అగర్వాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మనీష్‌ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ట్విట్వర్‌లో అనుచితమైన పోస్ట్‌లు పెట్టారని బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో మనీష్‌ను లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అక్రమంగా ఆయనపై కేసులు పెట్టారని సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసు కార్యాలయం లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు అఖిలేశ్‌యాదవ్. అయితే ఆ సమయంలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. టీ తాగాలని పోలీసు అధికారులు ఆఫర్ చేయగా అఖిలేశ్ తిరస్కరించారు. మీరు చాయ్‌లో విషం కలిపి ఇచ్చే అవకాశం ఉంది.. అందుకే తాగబోనని అన్నారు అఖిలేశ్ . తనకు బయట నుంచి టీ తెప్పించాలని కోరారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలేశ్. యూపీ పోలీసులపై తనకు అసలు నమ్మకం లేదని, అందుకే వాళ్లిచ్చే టీ కూడా తాగబోనని స్పష్టం చేశారు.
పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అఖిలేష్ యాదవ్..
#WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया।
उन्होंने कहा,”हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।”
(वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82
— ANI_HindiNews (@AHindinews) January 8, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..