AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Mandir: కర్ణాటకలో అయోధ్య తరహా రామ మందిరం.. ఆసక్తికర వివరాలు వెల్లడించిన మంత్రి

తమ రాష్ట్రంలో కూడా అయోధ్యలోని రామమందిర తరహా రామ మందిరాన్ని నిర్మించే ఆలోచన చేస్తున్నామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ చెప్పారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల సమయం ఉన్నప్పుడే.. రామమందిరాన్ని నిర్మించాలని మంత్రి ప్రతిపాదించడంపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మండిపడ్డారు.

Rama Mandir: కర్ణాటకలో అయోధ్య తరహా రామ మందిరం.. ఆసక్తికర వివరాలు వెల్లడించిన మంత్రి
Rama Mandir
Surya Kala
|

Updated on: Dec 30, 2022 | 3:41 PM

Share

హిందువులకు రాముడికి విడదీయరాని బంధం ఉంది. మానవుడిగా పుట్టి.. తన నడతతో ప్రేమతో.. వాక్కుతో దేవుడిగా కీరింబడుతున్నాడు శ్రీరాముడు. మనదేశంలో సీతారామురాల ఆలయం లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే రామ జన్మ భూమి అయోధ్యలో కొన్ని వందల ఏళ్ల  తర్వాత రాముడికి ఆలయ నిర్మాణం చేపట్టారు. సరయు తీరంలో రామ మందిర నిర్మాణం శర వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక రాష్ట్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ రాష్ట్రంలో కూడా అయోధ్యలోని రామమందిర తరహా రామ మందిరాన్ని నిర్మించే ఆలోచన చేస్తున్నామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ చెప్పారు.

ఈ మేరకు తీసుకునే నిర్ణయాన్ని వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటిస్తామని  తెలిపారు. బెళగావిలోని సువర్ణ సౌధలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..    రామమందిరాన్ని కర్ణాటకలో నిర్మించనున్నామని పేర్కొన్నారు. గత వారం.. రామనగర జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ్, అయోధ్యలోని రామ మందిరం తరహాలో రామదేవరబెట్టలో ఆలయాన్ని నిర్మించడానికి అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని కోరారు.

రామనగర జిల్లాలోని రామదేవరబెట్టను దక్షిణ భారతదేశంలోని అయోధ్యగా అభివృద్ధి చేయాలని.. వారసత్వ, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని బొమ్మై, ముజ్రాయి మంత్రి శశికళ జోలెకు రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు. రామదేవరబెట్టలో ముజ్రాయి శాఖకు చెందిన 19 ఎకరాల భూమిలో రామమందిరాన్ని నిర్మించాలని నారాయణ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల సమయం ఉన్నప్పుడే.. రామమందిరాన్ని నిర్మించాలని మంత్రి ప్రతిపాదించడంపై జనతాదళ్-సెక్యులర్ (జెడి-ఎస్) నాయకుడు.. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మండిపడ్డారు. గత మూడేళ్లలో ఏమీ చేయని పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు రామమందిర నిర్మాణం గురించి మాట్లాడుతోందని కుమారస్వామి అన్నారు.

రామదేవరబెట్టలో ప్రతిపాదిత రామమందిరానికి శంకుస్థాపన చేయడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను కూడా కుమారస్వామి వ్యతిరేకించారు. శంకుస్థాపనకు “యూపీ ముఖ్యమంత్రిని తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు.

ఇప్పటి వరకూ కర్ణాటక దివాళా తీయలేదు.. రామనగర ప్రజలకు నిజంగా రామదేవరబెట్టలో రామమందిరం కావాలంటే మా ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతి నేతృత్వంలో తానే చేస్తానని మాజీ సీఎం కుమార స్వామి అన్నారు . రామ మందిరం శంకుస్థాపనకు తమ సొంత సుత్తూరు మఠాధిపతిని ఆహ్వానిస్తామని జేడీఎస్ పంచరత్న యాత్రలో కుమారస్వామి అన్నారు. రామనగర తన నియోజకవర్గమని.. బయట వ్యక్తులను తన నియోజక వర్గంలో ఏమీ చేయనివ్వనని కుమారస్వామి అన్నారు. “దేవుడు తనకు తగినంత శక్తిని ఇచ్చాడు… ఎన్నికల సమయంలో వేరే రాష్ట్రం నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇలా  చేయకండని సూచించారు మాజీ సీఎం కుమారస్వామి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..