- Telugu News Photo Gallery Political photos PM Narendra Modi in final journey of his mother and Last rites were performed in Gandhi Nagar Telugu Political Photos
Heeraben Modi Funeral: మోదీ తల్లి హీరాబెన్ ఆఖరి మజిలీ.. చివరిసారిగా తల్లిని ముద్ధాడిన మోడీ..ఫొటోస్.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో ముగిసాయి.
Updated on: Dec 30, 2022 | 4:19 PM

ఓ వైపు గుండెల నిండా దుఃఖం..మరోవైపు విధి నిర్వహణ..ఎస్..తల్లిని కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ..తన విధులను మరవలేదు ప్రధాని మోదీ. దుఃఖాన్ని దిగమింగుకొని బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.

తల్లి మృతితో ఇవాళ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హౌరా-న్యూ జల్‌పయ్‌గురిని కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం తాను వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయానని..ఇందుకు బెంగాల్ ప్రజలు తనను క్షమించాలని కోరారు.

దీనిపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..మాతృమూర్తి మరణం తీరని లోటు..ఆ బాధ నుంచి బయటపడేలా మీకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను..మోదీజీ కాస్త రెస్ట్ తీసుకోండంటూ విచారం వ్యక్తం చేశారు.

ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన హీరాబెన్‌కు..స్వస్థలం గుజరాత్ గాంధీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీనగర్ సెక్టార్ 30లోని స్మశానవాటికలో..తన సోదరులతో కలిసి..తల్లికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు ప్రధాని మోదీ.

తల్లి పార్థివదేహానికి కన్నీటి నివాళులర్పించిన అనంతరం..స్వయంగా తల్లి పాడె మోశారు..అంతిమయాత్ర వాహనంలో తల్లి భౌతికకాయం పక్కనే కూర్చొని భావోద్వేగానికి గురయ్యారు.

తల్లి హీరాబెన్ మృతిపై భావోద్వేగ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. మహిమాన్వితమైన ఈశ్వరుడి పాదాల చెంత మా తల్లిగారు విశ్రాంతి తీసుకుంటున్నారు..

అమ్మను చూసినప్పడుల్లా త్రిమూర్తులను చూసిన అనుభూతి పొందేవాడిని అంటూ ట్వీట్ చేశారు.ఈ ఏడాది జూన్ 18న వందేళ్లు పూర్తి చేసుకున్నారు.

వందేళ్ల వయస్సు ఉన్నప్పటికీ నిన్నమొన్నటి వరకూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కొద్దిరోజుల క్రితం నుంచీ మాత్రం ఆరోగ్యం క్షీణించింది. అహ్మదాబాద్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

కుమారులు, ముఖ్యమైన కుటుంబసభ్యులు సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం వాహనంలో గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో తల్లి పాడెను స్వయంగా ప్రధాని మోదీ మోసారు. ఆ తర్వాత వాహనంలో పార్థివదేహంతో పాటు ప్రధాని మోదీ శ్మశానవాటికకు చేరుకున్నారు.

ఎటువంటి హడావుడి లేకుండా సాధారణంగా అంతిమయాత్ర నిర్వహించారు.





























