Rishabh Pant accident: పంత్ ప్రజంట్ సిట్యువేషన్ ఇది.. డిస్ లొకేట్ అయిన కుడి మోకాలి లిగ్మెంట్‌

ఢిల్లీ-డెహ్రాడూన్‌ NH-58..తెల్లవారుజామున 5.30గంటల సమయం..అదుపుతప్పిన ఓ కారు అతి వేగంతో డివైడర్‌ను ఢీకొట్టి..అంతెత్తున ఎగిరి అవతలివైపు పడింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

Rishabh Pant accident: పంత్ ప్రజంట్ సిట్యువేషన్ ఇది.. డిస్ లొకేట్ అయిన కుడి మోకాలి లిగ్మెంట్‌
Rishabh Pant accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2022 | 3:28 PM

భారత క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ రిషభ్‌ పంత్ రోడ్డు యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. శుక్రమవారం ఉదయం ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా డిల్లీ – డెహ్రాడూన్ నేషనల్ హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగింది. దీంతో వెంటనే డెహ్రాడూన్‌లోని హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసి వైద్యం అందిస్తున్నారు. తాజాగా పంత్ హెల్త్ కండీషన్‌పై బీసీసీఐ ప్రకటన రిలీజ్ చేసింది. పంత్‌ నుదురు చిట్లిందని.. వీపుపై మంటల కారణంగా కాలిన గాయాలు అయ్యాయని..  కుడి మోకాలి లిగ్మెంట్‌ డిస్ లొకేట్ అయినట్లు ఎక్స్‌రేల్లో తెలిసినట్లు పేర్కొంది. మడమ, బొటనవేలిపై కూడా గాయాలున్నాయి. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని బీసీసీఐ వెల్లడించింది.

పంత్ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది, ఇతర టెస్టులు, స్కాన్‌ల జరుగుతున్నాయని.. బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అలాగే పంత్ ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ మాట్లాడినట్లు వెల్లడించారు. అతడి పరిస్థితిని ఎప్పటికప్పుడు మోనిటర్ చేస్తున్నామని.. ఎలాంటి హెల్ప్ కావాలన్నా అందించడానికైనా రెడీగా ఉన్నట్లు  తెలిపారు. పంత్‌ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభత్వమే భరిస్తుందని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

ఈ ప్రమాదానికి కారణమేంటి? అతి వేగమే కారణమా? ఓవర్‌ స్పీడ్‌తో డ్రైవ్‌ చేయడం వల్లే కారును కంట్రోల్‌ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టారా..? లేక నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా..? అన్న అంశంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు ప్రమాదం టైమ్‌లో పంత్‌ సీట్‌ బెల్ట్‌ పెట్టుకున్నాడా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. కారులో రిషబ్‌ పంత్‌ ఒక్కడే ఉన్నాడని మెర్సిడెజ్‌ బెంజ్‌ను తానే డ్రైవ్‌ చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. మండుతున్న కారు అద్దాల్ని ప‌గుల‌గొట్టి ..రిషబ్‌ పంత్‌ బ‌య‌ట‌కు దూకిన‌ట్లు తెలిపారు. రాత్రి ప్రయాణం కావడంతో కాస్త నిద్రమత్తు వచ్చిందని..రెప్పపాటులోనే ప్రమాదం జరిగిందని వెల్లడించారు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌. రిషబ్‌ పంత్‌ ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ క్రికెటర్స్‌తో పాటు ఫ్యాన్స్‌ ప్రార్థిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..