Chanakya Niti: ఇంటి యజమానికి ఈ లక్షణాలు ఉంటే.. ఆ ఇల్లు సుఖ సంతోషాలకు నెలవు

ఆచార్య నీతి శాస్త్రంలో కుటుంబం, సంబంధాలు, డబ్బు, వ్యాపారం ,ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలను వివరించారు. ఆచార్య నీతి శాస్త్రంలో ఇంటి యజమానికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా ప్రస్తావించారు.

Chanakya Niti: ఇంటి యజమానికి ఈ లక్షణాలు ఉంటే.. ఆ ఇల్లు సుఖ సంతోషాలకు నెలవు
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2023 | 9:49 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. తన విధానాల బలంతో ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. ఆయన చెప్పిన విధానాలనే నేటికీ చాలా మంది అనుసరిస్తున్నారు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. ఆచార్య నీతి శాస్త్రంలో కుటుంబం, సంబంధాలు, డబ్బు, వ్యాపారం ,ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలను వివరించారు. ఆచార్య నీతి శాస్త్రంలో ఇంటి యజమానికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా ప్రస్తావించారు. ఇంటి పెద్దలో ఈ లక్షణాలు ఉంటే ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఆ గుణాలు ఏంటో తెలుసుకుందాం.

క్రమశిక్షణ – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఇంటి యజమానికి క్రమశిక్షణ ఉండటం చాలా ముఖ్యం. దీని వల్ల ఇంటి వాతావరణం కూడా క్రమశిక్షణతో ఉంటుంది. క్రమశిక్షణ ఉన్న ఇంటివారు జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు. అందుకే ఇంటి పెద్దలకు క్రమశిక్షణ చాలా ముఖ్యం.

సమానత్వం – కుటుంబ సభ్యులందరినీ  సమానంగా చూసే గుణం ఉండటం ఇంటి పెద్దకు చాలా ముఖ్యం. ఎటువంటి ఆధారం లేకుండా ఇంటి పెద్ద ఎవరినీ నమ్మకూడదు. ఇంట్లో ఏదైనా జరిగితే ఆ విషయాన్నీ ముందుగా నిర్ధారించుకోవాలి. ఇంటి పెద్ద ఎవరికీ మద్దతు ఇవ్వకూడదు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఇంటి పెద్దకు ఖర్చు చేసే విషయంలో అవగాహన కలిగి ఉండాలి. ఎటువంటి కారణం లేకుండా డబ్బు ఖర్చు చేయకూడదు. అనవసర ఖర్చులను చేస్తే.. ఆ ఇల్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి తెలివిగా ఖర్చు చేయాలి.

పొదుపు – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఇంటి పెద్ద డబ్బు ఆదా చేయాలి. ఎవరైతే డబ్బుని పొదుపు చేస్తారో.. అటువంటి ధనం కష్ట సమయాల్లో ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. సంపాదించిన డబ్బుని భవిష్యత్తులో కూడా ఉపయోగపడే ఉపయోగించాలి.

నిర్ణయాలు – ఆచార్య చాణక్యుడు ప్రకారం..ఇంట్లోని ఏ వ్యక్తికి హాని జరగని విధంగా ఇంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు