AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిన్నోళ్లకు తిన్నంత.. అదిరిపోయే వంటకాలతో మటన్‌ ఫెస్టివల్‌.. కేవలం పురుషులకు మాత్రమే.. ఎక్కడో తెలుసా?

ఉత్సవాల సమయంలో స్వామి వారికీ మొక్కుకున్న మేకపోతులతో  నాన్ వెజ్ విందు ఏర్పాటు చేస్తారు . ఈ నాన్ వెజ్ విందులో పురుషులు మాత్రమే పాల్గొంటారు . వందకు పైగా మేక పోతులని స్వామి వారికీ నైవేద్యం గా సమర్పిస్తారు .

తిన్నోళ్లకు తిన్నంత.. అదిరిపోయే వంటకాలతో మటన్‌ ఫెస్టివల్‌.. కేవలం పురుషులకు మాత్రమే.. ఎక్కడో తెలుసా?
Mutton Festival
Basha Shek
|

Updated on: Jan 08, 2023 | 8:36 AM

Share

తమిళనాడులోని మధురై జిల్లాలోని తిరుమంగళం లో ఉన్న కరుప్పయర్ ముత్తయ్య ఆలయం ఉంది . తిరుమంగళం తో పాటు మధురై జిల్లా వ్యాప్తంగా ఉన్న పురుషులు ఈ ఆలయం వేడుకలకుపెద్ద ఎత్తున తరలివస్తారు . ప్రతి సంవత్సరం మార్గళి మాసం లో ఉత్సవాలు జరుగుతాయి . ప్రతి ఒక్కరు తమ మొక్కులు చెల్లించడానికి ఒక్కో మేక పోతులను సంవత్సరం పాటు పెంచుతారు . ఉత్సవాల సమయంలో స్వామి వారికీ మొక్కుకున్న మేకపోతులతో  నాన్ వెజ్ విందు ఏర్పాటు చేస్తారు . ఈ నాన్ వెజ్ విందులో పురుషులు మాత్రమే పాల్గొంటారు . వందకు పైగా మేక పోతులని స్వామి వారికీ నైవేద్యం గా సమర్పిస్తారు . పురుషులకి ఎంత తింటారో అంత మటన్ వడ్డిస్తారు. తాజాగా జరిగిన వేడుకల్లో ఏకంగా సుమారు 10,000 మంది పురుషులు పాల్గొన్నారు. ఇందుకోసం మటన్ ముక్కలను రాశులుగా పోశారు. ఈ  తమిళనాడు నాన్‌వెజ్‌ ఫెస్టివల్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

స్త్రీలకు నో ఎంట్రీ..

అయితే స్త్రీలకు ఈ ఆలయం లో ప్రవేశం ఉందదు . ఈ ఆలయం లో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే మహిళలు ఒక నిబంధన పాటించాలి . నాన్ వెజ్ విందు పూర్తి ఆయన తరువాత పురుషులు ఇస్తరులు తీయకుండా అక్కడనుండి వెళ్లిపోతారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు స్త్రీలు పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదు . ఇస్తరులు పూర్తి గా ఎండిపోయి కనుమరుగైన తరువాత మాత్రమే స్త్రీలకు ఆలయ ప్రవేశం ఉంటుంది. పురుషులు యధావిధిగా వచ్చే సంవత్సరం మొక్కు కోసం ఇప్పటినుంచే మేకపోతులని సంవత్సరకాలం పాటు పెంచుతారు . కాగా వందల ఏళ్లుగా ఈ పండుగ జరుగుతోందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇందులో పాల్గొనే పురుషుల కోరికలు అతి త్వరలోనే నెరవేరుతాయని నమ్మకమట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్