- Telugu News Photo Gallery World photos New York Grand Central Terminal Is The World Largest Railway Station See The Photos
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇదే.. ఎన్ని ఎకరాల్లో నిర్మించారో తెలిస్తే షాక్ అవుతారు
మనం తరచూ రైలులో ప్రయాణిస్తూనే ఉంటాం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను ఎలా నిర్మించారో, ఎక్కడుందో తెలుసా? ఇప్పుడా విషయాలు తెలుసుకుందాం రండి.
Updated on: Jan 07, 2023 | 1:43 PM

మనం తరచూ రైలులో ప్రయాణిస్తూనే ఉంటాం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను ఎలా నిర్మించారో, ఎక్కడుందో తెలుసా? ఇప్పుడా విషయాలు తెలుసుకుందాం రండి.

న్యూయార్క్ నగరంలో ఉన్న గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్. 1901-1903 మధ్యకాలంలో ఈ స్టేషన్‌ను నిర్మించారు.

ఈ రైల్వే స్టేషన్‌లో 44 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ప్రత్యేక వాస్తుశిల్పాలతో, డిజైన్లతో సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ను ఎంతో అందంగా నిర్మించారు. అందుకే ఈ స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది.

అన్నట్లు ఈ రైల్వే స్టేషన్‌లో పలు సినిమా షూటింగులను చిత్రీకరించారు. ఈ స్టేషన్ సైట్ లోతు సుమారు 45 అడుగులు. స్టేషన్ నిర్మాణం కోసం రోజుకు కనీసం 10,000 మంది కార్మికులు పనిచేశారట. 1913 సంవత్సరంలో కొత్త టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ఏటా 67 మిలియన్ల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తోంది. ప్రతి 58 సెకన్లకు ఒక రైలు ఈ స్టేషన్ మీదుగా బయలుదేరుతుంది.





























