Ajay: హోటల్‌లో గిన్నెలు కడిగా.. పిల్లలు దగ్గరికి రావడానికి భయపడ్డారు.. గడ్డు పరిస్థితులు గుర్తుచేసుకున్న నటుడు అజయ్‌

Basha Shek

Basha Shek |

Updated on: Jan 07, 2023 | 1:14 PM

రాజమౌళి- రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో భయంకరమైన విలన్‌గా ప్రేక్షకుల్ని భయపెట్టాడు. అందులో టిట్లా క్యారెక్టర్‌తో ఓవర్‌నైట్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్‌. ఆతర్వాత తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు. మధ్యలో సారాయి వీర్రాజు సినిమాతో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు.

Ajay: హోటల్‌లో గిన్నెలు కడిగా.. పిల్లలు దగ్గరికి రావడానికి భయపడ్డారు.. గడ్డు పరిస్థితులు గుర్తుచేసుకున్న నటుడు అజయ్‌
Actor Ajay

సుమారు రెండు దశాబ్దాల క్రితం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన ఖుషి సినిమాలో ఒక చిన్న రోల్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు అజయ్‌. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఖుషి సినిమా తర్వాత డజనుకు పైగా చిత్రాలు చేసినా పాపులర్‌ కాలేకపోయాడు. అయితే రాజమౌళి- రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో భయంకరమైన విలన్‌గా ప్రేక్షకుల్ని భయపెట్టాడు. అందులో టిట్లా క్యారెక్టర్‌తో ఓవర్‌నైట్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్‌. ఆతర్వాత తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు. మధ్యలో సారాయి వీర్రాజు సినిమాతో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే జనాలు అతనిని విలన్‌ పాత్రల్లోనూ ఊహించుకున్నారు. దీంతో ఆ తర్వాత హీరోగా చేయలేదు. అయితే ఇష్క్‌, దిక్కులు చూడకు రామయ్య లాంటి సినిమాల్లో సాఫ్ట్‌ క్యారెక్టర్లు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్క 2 సినిమాలో బన్నీతో కలిసి పండించిన కామెడీ అందరికీ గుర్తుండిపోతుంది. కాగా ప్రస్తుతం విలన్‌గానూ, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉంటోన్న ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు.

పిల్లలు దగ్గరికి రావడానికి భయపడ్డారు..

పొడుగ్గా ఉన్నాననే ఇండస్ట్రీకి వచ్చాను. ఇక విక్రమార్కుడు సినిమా తర్వాత పిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడ్డారు. నేను విలన్‌ క్యారెక్టర్లు చేసేటప్పుడు కాస్త హైట్‌గా ఉన్న హీరోసే కావాలని కోరుకుంటాను. అయితే ఒకసారి ఏమైందో తెలియదు కానీ.. అనుకోకుండా నేపాల్ వెళ్లిపోయాను. తీరా అక్కడకు వెళ్లాక డబ్బులు అయిపోయాయి. దీంతో ఓ టిబెటన్ రెస్టారెంట్ లో గిన్నెలు కూడా కడిగాను. అలాగే ఓ సినిమా షూటింగ్ లో కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు అజయ్‌. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప 2 లో ఓ కీలక పాత్రలో నటించనున్నాడు అజయ్‌. అలాగే కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అజిత్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన తనివు (తెలుగులో తెగింపు) సినిమాలోనూ కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu