IND vs SL: హ్యాట్రిక్‌ నోబాల్స్‌.. 2 ఓవర్లలో 37 రన్స్‌.. చెత్త బౌలింగ్‌తో టీమిండియాను నిండా ముంచిన వరల్డ్‌కప్‌ హీరో

యువ ఫాస్ట్ బౌలర్, వరల్డ్‌ కప్‌ హీరో అర్ష్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాలను నమోదుచేసి టీమిండియాను నిండా ముంచేశాడు.

IND vs SL: హ్యాట్రిక్‌ నోబాల్స్‌.. 2 ఓవర్లలో 37 రన్స్‌.. చెత్త బౌలింగ్‌తో టీమిండియాను నిండా ముంచిన వరల్డ్‌కప్‌ హీరో
Hardik Pandya, Arshdeep Sin
Follow us

|

Updated on: Jan 06, 2023 | 8:39 AM

టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యాకు ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. అతని కెప్టెన్సీలో భారత్ బాగానే రాణించింది. ఇక శ్రీలంతో ముంబై వేదికగా జరిగిన మొదటి టీ20లోనూ గెలిచి తన విజయపరంపరను కొనసాగించింది. అయితే పుణెలో లంకేయులతో జరిగిన టీ20లో మాత్రం హార్దిక్‌ పాండ్యా కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ శ్రీలంక అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు, భారత బౌలర్ల క్రమశిక్షణారాహిత్యం జట్టును దెబ్బతీసింది. ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్, వరల్డ్‌ కప్‌ హీరో అర్ష్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాలను నమోదుచేసి టీమిండియాను నిండా ముంచేశాడు. గాయంతో మొదటి మ్యాచ్‌కి దూరమైన ఈ స్వింగ్ బౌలర్‌ రెండో మ్యాచ్‌లో పదే పదే నోబాల్స్‌ వేశాడు. ఏ మాత్రం పసలేకుండా బౌలింగ్‌ చేసిన అతను రెండు ఓవర్లలో ఏకంగా 5 నోబాల్స్ వేయడం గమనార్హం. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ను చూసి ఏం చేయాలో తెలియలేక కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా గ్రౌండ్‌లోనే ముఖం దాచుకున్నాడు.

కాగా అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ను చూసి కెప్టెన్‌ హార్దిక్‌ మళ్లీ చాలా సేపు ఓవర్‌ ఇవ్వలేదు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లోనే అతనిని మళ్లీ బౌలింగ్‌కు పిలిచాడు కెప్టెన్‌. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో నిష్ణాతుడని నిరూపించుకున్న అర్ష్‌దీప్.. రెండో ఓవర్లోనూ అదే రిపీట్‌ చేశాడు. మళ్లీ నోబాల్స్ వేశాడు .కాగా ఈ మ్యాచ్‌ లో కేవలం 2 ఓవర్లు వేసిన అర్ష్‌దీప్‌ ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా పలు చెత్త రికార్డులను అర్ష్‌దీప్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ నోబాల్స్‌ వేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్‌ వేసిన తొలి టీమిండియా బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్‌ చెత్త రికార్డు నెలకొల్పాడు. కాగా ఈ ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మొత్తం 7 నో బాల్స్‌ వేసింది. దీని కారణంగానే లంక భారీస్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో