Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: సమంత ఆరోగ్యం గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్.. అమ్మలా కాపాడుకోవాలని ఉందంటూనే..

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా సామ్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించింది. తన తాజా సినిమా వారిసు (తెలుగులో వారసుడు) ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె సామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Rashmika Mandanna: సమంత ఆరోగ్యం గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్.. అమ్మలా కాపాడుకోవాలని ఉందంటూనే..
Samantha, Rashmika
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2023 | 1:38 PM

ప్రముఖ హీరోయిన్‌ సమంత మయోసైటిస్‌ బారిన పడిందన్న విషయం తెలియగానే సినిమా ఇండస్ట్రీ షాక్‌ కు గురైంది. సినిమా తారలతో పాటు పలువుర ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. సామ్‌కు ధైర్యం చెబుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ నటి, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా సామ్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించింది. తన తాజా సినిమా వారిసు (తెలుగులో వారసుడు) ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె సామ్‌పై ప్రశంసలు కురిపించింది. అయితే ఆమె మయోసైటిస్‌తో బాధపడుతోన్న విషయం ప్రకటించే వరకూ తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ‘సమంత అద్భుతమైన మహిళ. ఆమె ఎంతో దయ కలిగిన, అందమైన వ్యక్తి. ఒక అమ్మలాగా తనని ఎప్పుడూ  సంరక్షించాలనుకుంటున్నాను. మయోసైటిస్‌ గురించి ఆమె ప్రకటించిన తర్వాతనే నాకు కూడా తెలిసింది. ఎందుకంటే, అంతకు ముందు తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడిన సందర్భాల్లేవు. ఏదేమైనా ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదుర్కొని నిలిచింది సామ్‌. చాలామందిలాగే నేను కూడా ఆమె నుంచి స్ఫూర్తి పొందుతాను’ అని పేర్కొంది రష్మిక.

కాగా అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. సమంత ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే బయట వీరిద్దరు మంచి స్నేహితులన్న టాక్‌ ఉంది. కాగా ఇటీవలే యశోద సినిమాతో మరో సూపర్‌ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది సమంత. లేడీ ఓరియంటెడ్‌గా వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులో సామ్‌ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక రష్మిక విషయానికొస్తే.. దక్షిణాదిని బిజీ హీరోయిన్‌గా మారింది. అలాగే బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..