అవి బంతులా? బుల్లెట్లా? తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌.. 12 ఓవర్లలో 8 వికెట్లు.. రికార్డులు చెరిపేసిన టీమిండియా బౌలర్

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఉనద్కత్ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. అంతటితో ఆగకుండా తన రెండో ఓవర్‌ లో మరో 2 వికెట్లు తీశాడు. అలా మొత్తం 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

అవి బంతులా? బుల్లెట్లా? తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌.. 12 ఓవర్లలో 8 వికెట్లు.. రికార్డులు చెరిపేసిన టీమిండియా బౌలర్
Ranji Trophy
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2023 | 1:33 PM

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ చరిత్ర సృష్టించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఉనద్కత్ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. అంతటితో ఆగకుండా తన రెండో ఓవర్‌ లో మరో 2 వికెట్లు తీశాడు. అలా మొత్తం 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. సౌరాష్ట్ర, ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ యశ్ దుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని తొలి ఓవర్‌లోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ మూడో బంతికి ధృవ్ షోరే (0), నాలుగో బంతికి వైభవ్ రావల్ (0), ఐదో బంతికి యశ్ దుల్ (0)లను ఉనాద్కట్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ నాలుగో బంతికి జాంటీ సింధు (4) బౌల్డ్ చేశాడు. ఇక చివరి బంతికి లలిత్ యాదవ్ (0)ను ఎల్బీగా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత లక్షయ్‌ తేరేజా (1), శివంక్ వశిష్ట్ (38), కుల్‌దీప్ యాదవ్ ( 0)లను కూడా ఔట్‌ చేశాడు. ఇలా మ్యాచ్‌ మొత్తం మీద 12 ఓవర్ల వేసిన ఈ టీమిండియా వెటరన్‌ బౌలర్‌ 29 పరుగులిచ్చి మొత్తం 8 వికెట్లు నేలకూల్చాడు.

ఉనాద్కత్ చెలరేగడంతో ఢిల్లీ 0 పరుగులకే 3 వికెట్లు, 4 పరుగులకే 4వ వికెట్లు, 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే ప్రన్షు విజయరన్ (15), హృతిక్‌ షోకిన్‌ (68 నాటౌట్‌), శివంక్ వశిష్ట్ (38) ఆదుకోవడంతో 133 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది ఢిల్లీ. కాగా ఇటీవలే 12 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఉనాద్కత్‌. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 8 వికెట్లు పడగొట్టి మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!