AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 6 6 4 6.. 35 బంతుల్లో 74 రన్స్ .. అంపైర్‌ పొరపాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగిన పంత్‌ స్నేహితుడు

మార్కస్ స్టోయినిస్ గతంలో ఐపీఎల్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2021 లోనూ ఢిల్లీ జట్టుతోనే ఉన్నాడు.  అయితే ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 9 కోట్ల 20 లక్షలు చెల్లించి ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది.

6 6 6 4 6..  35 బంతుల్లో 74 రన్స్ .. అంపైర్‌ పొరపాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగిన  పంత్‌ స్నేహితుడు
Marcus Stoinis
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2023 | 9:36 AM

6 6 6 4 6 1… ఇది మొబైల్ నంబరేమీ కాదు.. ఒకే ఓవర్‌ లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ సాధించిన పరుగుల సంఖ్య. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్ స్టార్స్‌ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడాడు. 211 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో కేవలం 35 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అడిలైడ్‌ బౌలర్‌ వేసిన ఓ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు స్టాయినిస్‌. 4 సిక్సర్లతో సహా మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు. కాగా మార్కస్ స్టోయినిస్ గతంలో ఐపీఎల్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2021 లోనూ ఢిల్లీ జట్టుతోనే ఉన్నాడు.  అయితే ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 9 కోట్ల 20 లక్షలు చెల్లించి ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది.  స్టోయినిస్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 178 పరుగులకే ఆలౌటైంది. తద్వరా విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

అంపైర్‌ పొరపాటుతో..

కాగా అంపైర్‌ చేసిన పొరపాటు లేదా పట్టించుకోకపోవడం వల్ల మార్కస్‌ స్టోయినిస్‌ క్రీజులో దిగినప్పుడే టైమ్‌ ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. వాస్తవానికి, బ్యాటర్‌ 75 సెకన్లలో క్రీజులోకి వచ్చిన తర్వాత ఆడటానికి సిద్ధంగా ఉండాలనేది నియమం. ఇలా జరగకపోతే ఫీల్డింగ్ టీమ్ బ్యాటర్‌పై ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు అంపైర్ బ్యాటర్‌కు సమయం ఇస్తాడు. అయితే అంపైర్ ఇవేమీ పట్టించుకోకపోవడంతో స్టోయినిస్ టైమ్ ఔట్‌ నుంచి బయటపడ్డాడు. అంపైర్‌ ఇచ్చిన జీవనాదానంతో మైదానంలో రెచ్చిపోయాడు స్టొయినిస్‌. విధ్వంసకర ఇన్నింగ్స్‌ తో ఏకంగా మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. కాగా మ్యాచ్ తర్వాత, అడిలైడ్ స్ట్రైకర్స్ ఆటగాడు ఆడమ్ హోష్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే, స్టోయినిస్ నిర్ణీత సమయంలోనే క్రీజుకు చేరుకున్నాడు. కానీ 75 సెకన్లలో ఆడడానికి సిద్ధంగా లేడు. దీంతో మేం అంపైర్‌ కు అప్పీల్‌ చేశాం. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. హోష్ ప్రకటన తర్వాత, స్టోయినిస్ కూడా స్పందించాడు. ‘ ఫీల్డర్‌లు తమ స్థానాలను మారుస్తున్నందున నేను క్రీజుకు కొంచెం దూరంగా ఒక స్టాన్స్‌తో నిలబడి ఉన్నాను అని చెప్పాడు. ఫీల్డింగ్ మారే వరకు స్టాన్స్‌లో నిలబడి ఏం చేస్తాను. ఫీల్డ్ సెట్ అయ్యిందో లేదో ముందుగా నిర్ణయించుకుని దాని ప్రకారం ఆడతాను’ అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..