Akira Nandan: ఫ్యాన్స్‌తో కలిసి ఖుషి సినిమాను వీక్షించిన అకీరా నందన్‌.. ఈలలు, కేకలతో హోరెత్తిన థియేటర్‌

పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ ఖుషి సినిమాను వీక్షించాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్‌కు వెళ్లిన అతను అభిమానుల‌తో క‌లిసి పవన్‌ సినిమాను చూశాడు. ఎటువంటి హంగామా లేకుండా ముఖానికి మాస్క్, ఒక హుడీ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు అకీరా.

Akira Nandan: ఫ్యాన్స్‌తో కలిసి ఖుషి సినిమాను వీక్షించిన అకీరా నందన్‌.. ఈలలు, కేకలతో హోరెత్తిన థియేటర్‌
Akira Nandan
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2023 | 11:09 AM

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కొత్త సంవత్సరం కాస్త ముందుగానే వచ్చింది. పవన్ నటించిన ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీ సినిమా ఖుషి రీ రిలీజ్‌ చేయడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలారు. సుమారు 21 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం విశేషం. దీంతో పవన్‌ సినిమాను థియేటర్లలో వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. . తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. ఏదైనా కొత్త సినిమా విడుదలైందా? అన్నట్లు థియేటర్ల బయట సంబరాలు చేసుకున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. ఇక విశేషమేమిటంటే.. పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ ఖుషి సినిమాను వీక్షించాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్‌కు వెళ్లిన అతను అభిమానుల‌తో క‌లిసి పవన్‌ సినిమాను చూశాడు. ఎటువంటి హంగామా లేకుండా ముఖానికి మాస్క్, ఒక హుడీ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు అకీరా. దీంతో మొదట ఎవరూ అతనిని గుర్తుపట్టలేదు. అయితే కొందరు అభిమానులు గుర్తుపట్టి ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ‘పదేళ్లయినా.. పవర్‌ స్టార్‌ క్రేజ్‌ తగ్గలేదు’ అంటూ గబ్బర్ సింగ్‌ సినిమా డైలాగును గుర్తు చేస్తూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగేసింది. భూమిక హీరోయిన్‌గా నటించింది. పవన్ కల్యాణ్ నటన, స్టైల్, యాక్షన్ ఎపిసోడ్స్.. భూమిక, అలీ నటీనటుల పెర్ఫామెన్స్, మణిశర్మ పాటలు సంచలనం సృష్టించాయి. ఇక అకిరా నందన్‌ విషయానికొస్తే.. తండ్రి తరహాలోనే తనయుడు కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినిమాలు చేయకపోయినా, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండకపోయినా అకీరా నందన్ క్రేజ్‌ రోజురోజుకు పెరిగిపోతోంది.అకీరా ఫోటోలను అతడి తల్లి రేణు దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతుంటారు. ఇక ఆ మధ్యన మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తున్న అకీరా ఫొటోలు ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి. అతనిని ఎప్పుడెప్పుడు సిల్వర్‌ స్ర్కీన్‌పై చూద్దామా? అని ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే