AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: పంత్‌ కారు ప్రమాదంపై తప్పుడు వార్తలు.. తాగి నడిపాడంటూ పుకార్లు.. వివరణ ఇచ్చిన పోలీసులు

పంత్ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ప్రమాంపై దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంత్ అతి వేగంతో కారు డ్రైవింగ్ చేశాడని, అందుకే ప్రమాదం జరిగిందని కొన్ని మీడియా కథనాలలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు.

Rishabh Pant: పంత్‌ కారు ప్రమాదంపై తప్పుడు వార్తలు.. తాగి నడిపాడంటూ పుకార్లు.. వివరణ ఇచ్చిన పోలీసులు
Rishabh Pant Accident
Basha Shek
|

Updated on: Jan 01, 2023 | 7:13 AM

Share

టీమిండియా వికెట్‌ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ కోసం అభిమానులు, వెటరన్ క్రికెటర్లు ప్రార్థనలు చేస్తున్నారు. పంత్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు కానీ అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పంత్ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ప్రమాంపై దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంత్ అతి వేగంతో కారు డ్రైవింగ్ చేశాడని, అందుకే ప్రమాదం జరిగిందని కొన్ని మీడియా కథనాలలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు. అయితే ఈ వాదనలన్నింటినీ ఉత్తరాఖండ్ పోలీసులు ఖండించారు. పంత్‌ తాగి కారు నడిపి ఉంటే అంత దూరం ఎలా వస్తాడని.. ఇవన్నీ తప్పుడు వార్తలని.. ఎవరు నమ్మొద్దని.. ప్రమాదం జరిగిన సమయంలో పంత్‌ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా హరిద్వార్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ, ‘మేము నర్సన్ సరిహద్దులోని కెమెరాలను 8 నుండి 10 సార్లు తనిఖీ చేశాం. ఒక‌వేళ అతను మ‌ద్యం సేవించి ఉంటే ఢిల్లీ నుంచి 200 కిలోమీట‌ర్ల దూరం ఒక్క యాక్సిడెంట్ కూడా చేయ‌కుండా కారు ఎలా న‌డ‌ప‌గ‌ల‌డు? కారు ప్రమాదానికి గురైన‌ప్పుడు పంత్ సాధార‌ణ స్థితిలోనే ఉన్నట్లు ప్రాథ‌మిక చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ మ‌ద్యం సేవించ‌లేదు కాబ‌ట్టే ప్రమాదానికి గురైన వెంటనే కారు లోంచి బ‌య‌ట‌కు రాగ‌లిగాడు. ఆ టైమ్‌లో తాగిన‌వాళ్లు కారు నుంచి బ‌య‌ట‌కు రాలేరు. పైగా పంత్‌ను రక్షించిన బస్‌ డ్రైవర్‌తో కూడా పంత్‌ మాములుగానే మాట్లాడడం సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్‌ అయ్యింది’

నిజనిజాలు తెలుసుకోవాలి..

ఇక జాతీయ రహదారిపై గంటకు 80 కి.మీ వేగ పరిమితి ఉండగా పంత్‌ తన కారును ఎక్కడా 80 కిలోమీట‌ర్ల వేగ ప‌రిమితికి మించి నడపలేదు. మా సాంకేతిక బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. పంత్ అతివేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పడానికి మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నిద్రపోవడం వల్లే పంత్‌కు ప్రమాదం జరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు’ అని హ‌రిద్వార్ సీనియ‌ర్ ఎస్పీ అజ‌య్ సింగ్ తెలిపారు. కాగా ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. ముఖానికి తీవ్రంగా గాయాలు కావడంతో ప్లాస్టిక్ స‌ర్జరీ చేశారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్‌ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అతను ఇప్పట్లో మైదానంలో కనిపించే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్