- Telugu News Photo Gallery Cricket photos Hardik Pandya meets Home Minister Amit Shah before taking charge of Team India for SriLanka series
Hardik Pandya: అమిత్‌షాను కలిసిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. కారణమేంటంటే?
త్వరలో శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను టీమిండియా కెప్టెన్‌గా నియమించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో పరిమిత ఓవర్లలోనూ జట్టు సారథ్య బాధ్యతలు హార్దిక్‌కే అప్పగించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో పాండ్యా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది.
Updated on: Dec 31, 2022 | 1:02 PM

త్వరలో శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను టీమిండియా కెప్టెన్‌గా నియమించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో పరిమిత ఓవర్లలోనూ జట్టు సారథ్య బాధ్యతలు హార్దిక్‌కే అప్పగించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో పాండ్యా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది.

హార్దిక్ పాండ్యా తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి అమిత్ షాను కలిశాడు. అనంతరం ఈ ఫొటోలను పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అందులో హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కూడా ఉన్నాడు.

'మమ్మల్ని ఆహ్వానించినందుకు, మా కోసం సమయం కేటాయించినందుకు హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది' అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు పాండ్యా.

పాండ్యా IPL-2022లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో గుజరాత్ ఐపీఎల్ టైటిల్‌ను గెల్చుకుంది. దీంతో అప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ రేసులో బలమైన పోటీదారుగా పాండ్యాను భావిస్తున్నారు.

ఇక హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కూడా భారత్ తరఫున ఆడాడు. అయితే ఏడాదిన్నరగా అతడు టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. కృనాల్ 20 జూలై 2021న శ్రీలంకతో భారత్ తరపున తన చివరి ODI ఆడాడు.