- Telugu News Photo Gallery Cricket photos Mithali Raj Jhulan Goswami Serena Williams Ashleigh Barty players retired in 2022
Year Ender 2022: మిథాలీ టు రోజర్ ఫెదరర్.. ఈ ఏడాది రిటైర్మెంట్‌తో షాకిచ్చిన క్రీడాకారులు వీరే
2022 సంవత్సరంలో పలువురు క్రీడాకారులు తమ ఆటకు వీడ్కోలు పలికారు. కొన్నేళ్ల తరబడి తమ ఆటతీరుతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న వీరు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అలా ఈ ఏడాది ఆటకు గుడ్‌బై చెప్పిన వారెవరో తెలుసుకుందాం రండి.
Updated on: Dec 31, 2022 | 7:50 AM

2022 సంవత్సరంలో పలువురు క్రీడాకారులు తమ ఆటకు వీడ్కోలు పలికారు. కొన్నేళ్ల తరబడి తమ ఆటతీరుతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న వీరు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అలా ఈ ఏడాది ఆటకు గుడ్‌బై చెప్పిన వారెవరో తెలుసుకుందాం రండి.

మిథాలీ రాజ్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను ఈ ఏడాది జూన్ 8న ముగించింది. మిథాలీ రాజ్ 2019లో టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైరైంది. 1999లో 16 ఏళ్ల వయసులో టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసింది. వన్డేల్లో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఆమె. ఆమె కెరీర్‌లో 7805 పరుగులు ఉన్నాయి. ఇందులో 7 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సెరెనా ఈ ఏడాది ఆగస్టులో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. దీని తర్వాత US ఓపెన్ ఆమె చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌గా పేర్కొంది. ఈ టోర్నీలో ఓటమి తర్వాత ఏడుస్తూ కోర్టు బయటికి వెళ్లింది. సెరెనా తన కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లను, తన అక్క వీనస్‌తో కలిసి 14 డబుల్స్ టైటిళ్లను కూడా గెలుచుకుంది.

టీమిండియా మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైర్‌మెంట్ ప్రకటించింది. 2002 సంవత్సరంలో ఇంగ్లండ్‌తో అరంగేట్రం చేసిన ఆమె ఆఖరి మ్యాచ్ కూడా అదే జట్టుతో ఆడింది. 12 టెస్టు మ్యాచ్‌ల్లో 44 వికెట్లు, 204 వన్డేల్లో 255 వికెట్లు పడగొట్టింది ఝులన్.

యువ టెన్నిస్ స్టార్ ఆష్లే బార్టీ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఆమె నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్. బార్టీ వరుసగా 114 వారాల పాటు WTA ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ప్లేయర్. యాష్లే బార్టీ పేరు మీద మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి.

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ తన కెరీర్‌ను లావర్ కప్ 2022తో ముగించాడు. రాఫెల్ నాదల్‌తో కలిసి వీడ్కోలు మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ తర్వాత నాదల్, ఫెదరర్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. ఫెదరర్ తన కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు.





























