AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karate Kalyani: వ్యభిచారిణిలా చూస్తున్నారు.. నాలో మంచిని ఎవరూ చూడడం లేదు.. కరాటే కల్యాణి ఎమోషనల్‌

ప్రస్తుతం సినిమాలు చేయడం బాగా తగ్గించేసిన ఆమె ఇటీవల ఇతర విషయాలు, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఏవిషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తత్వం చాలాసార్లు ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ఇలా ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ అందరి నోళ్లలో నానుతోన్న కరాటే కల్యాణి తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు

Karate Kalyani: వ్యభిచారిణిలా చూస్తున్నారు.. నాలో మంచిని ఎవరూ చూడడం లేదు.. కరాటే కల్యాణి ఎమోషనల్‌
Karate Kalyani
Basha Shek
|

Updated on: Dec 31, 2022 | 8:51 AM

Share

లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కరాటే కల్యాణి ఒకరు. అలాగే బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయడం బాగా తగ్గించేసిన ఆమె ఇటీవల ఇతర విషయాలు, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఏవిషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తత్వం చాలాసార్లు ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ఇలా ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ అందరి నోళ్లలో నానుతోన్న కరాటే కల్యాణి తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన వైవాహిక జీవితం, సినిమా కెరీర్‌, ఎదుర్కొన్న ఆటుపోట్లపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాల్లో తాను బోషించిన బోల్డ్‌ పాత్రలు, నిజ జీవితంలో వాటి ప్రభావంపై పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

‘బతుకుదెరువు కోసమే నేను సినిమాల్లో నటిస్తున్నా. చాలామంది నాలో బాబీ (కృష్ణ సినిమాలో కరాటే కల్యాణి పాత్ర)నే చూశారు. కానీ నాలో మరో కోణం కూడా ఉంది. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగిస్తాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఎంతోమందికి సాయం చేస్తున్నాను. కానీ జనాలు అవేవి చూడడం లేదు. తెరపై నేను పోషించిన పాత్రలను బట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ట్రీట్‌ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నన్ను ఓ వ్యభిచారిగా చూస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్‌ నన్ను చాలా బాధిస్తున్నాయి. వాటిని విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. నేను తెరపై నటించానంతే, నిజంగా చేయలేదు. బతుకు దెరువు కోసం అలాంటి రోల్స్‌ చేశాను. నాలోని మంచిని గుర్తించకుండా నాపై అసహ్యమైన కామెంట్స్‌ చేస్తుంటారు. నేను అలాంటి దాన్ని కాదు. ఎప్పుడూ అలాంటి తప్పు చేయలేదంటూ’ అంటూ కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!