AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. మొసలికే చుక్కలు చూపించిన శునకం.. పారిపోతున్నా వదల్లేదుగా.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

సాధారణంగా మొసలిని చూడగానే అందరూ దూరంగా పారిపోతారు. అలాగే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా వాటి జోలికి వెళ్లడానికి భయపడతాయి. కానీ ఈ వీడియోలో మాత్రం కుక్క ధైర్యంగా మొసలిపై దాడి చేస్తుంది. ఇప్పుడిదే నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది.

Viral Video: వామ్మో.. మొసలికే చుక్కలు చూపించిన శునకం.. పారిపోతున్నా వదల్లేదుగా.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Dog, Crocodile
Basha Shek
|

Updated on: Dec 30, 2022 | 6:49 PM

Share

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో మొసళ్లను ఒకటిగా పరిగణిస్తారు. సింహాలు, పులులు, ఏనుగులు వంటి క్రూర జంతువులు కూడా వీటికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే మొసళ్లు చాలా శక్తివంతమైనవి. ఇక నీటిలో ఉన్నప్పుడు వీటికి ఏనుగుల బలం ఉంటుందట. ఇక సోషల్ మీడియాలో కూడా మొసళ్ల దాడికి సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. అందులో కొన్నిసార్లు అవి అడవి జంతువులపై దాడి చేయడం ఇంకొన్ని సార్లు అవి మనుషులపై దాడి చేయడం మనం చూస్తుంటే ఉంటాం. ఇప్పుడు కూడా మొసలికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇందులో కుక్క మొసలిపై దాడి చేసి పైచేయి సాధించింది. సాధారణంగా మొసలిని చూడగానే అందరూ దూరంగా పారిపోతారు. అలాగే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా వాటి జోలికి వెళ్లడానికి భయపడతాయి. కానీ ఈ వీడియోలో మాత్రం కుక్క ధైర్యంగా మొసలిపై దాడి చేస్తుంది. ఇప్పుడిదే నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ వీడియోలో మీరు మొసలి ఇంకా చిన్నగా ఉంది. పైగా దాని నోరు కట్టేసి ఉంది. దీనిని గ్రహించిన కుక్కు మొసలిపై విరుచుకుపడింది. కుక్క బారి నుంచి మొసలి తప్పించుకునేందుకు ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. పారిపోతున్న మొసలిపై వెంటబడి మరీ దాడి చేస్తుంది. beautiful_new_pix అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్‌ చేయగా క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 5 లక్షల వ్యూస్‌ రాగా, 20 వేలకు పైగానే లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొసలి నోరు కట్టేసుంది కాబట్టి కుక్క ఆటలు సాగుతున్నాయి. ‘మొసలి నోరు ఒక్కసారి తెరవండి, అది కుక్కను ఏమి చేస్తుందో చూడండి’అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కుక్క, మొసలిల గొడవకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..